బిజినెస్

ఈ ఏడాది 6.9% వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే త్రైమాసికాల్లో మరింతగా కోలుకోవచ్చని, ఈ ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చని ఫిట్జ్ గ్రూపునకు చెందిన బిఎంఐ రిసెర్చ్ ఒక నివేదికలో అభిప్రాయ పడింది. భారత ఆర్థికాభివృద్ధి గత ఏడాది నవంబర్‌లో జరిగిన నోట్ల రద్దు ప్రతికూల ప్రభావాలనుంచి పూర్తిగా బైటపడి రాబోయే రోజుల్లో పుంజుకోవచ్చని, అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు బలహీనంగా ఉండడం వల్ల ఈ రికవరీ కొంతమేరకు పరిమితం కావచ్చని ఆ నివేదిక అభిప్రాయ పడింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జిడిపి వృద్ధి గణనీయంగా మందగించి 6.1 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే.