బిజినెస్

వడ్డీ రేటు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఓఐ) తమ పొదుపు ఖాతాల్లోని 50 లక్షల రూపాయల లోపు డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటును 3.5 శాతానికి (50 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. అయితే రూ.50 లక్షలు పైబడిన సేవింగ్స్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 4 శాతంగానే కొనసాగుతుందని ఆ బ్యాంకు ప్రకటించింది. సేవింగ్స్ డిపాజిట్లపై రెండంచెల వడ్డీ రేటును ప్రవేశపెడుతున్నామని, ఆగస్టు 24వ తేదీ నుంచే ఇది అమలులోకి వస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది. పొదుపు ఖాతాల్లో రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్‌ను కొనసాగించే ఖాతాదారులకు ఇకమీదట 3.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుందని, రూ.50 లక్షలు కంటే ఎక్కువ బ్యాలెన్స్‌ను కలిగివున్న ఖాతాదారులకు చెల్లించే వార్షిక వడ్డీ మాత్రం 4 శాతంగానే కొనసాగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ పొదుపు ఖాతాల్లోని కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటును 3.5 శాతానికి (50 బేసిస్ పాయింట్లు) తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకులు సహా మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. ఈ రూ.50 లక్షల లోపు సేవింగ్స్ డిపాజిట్లపై చెల్లించే వార్షిక వడ్డీ రేటను యాక్సిస్ బ్యాంకు ఈ నెల ఆరంభంలో 3.5 శాతానికి తగ్గించగా, ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి)తో పాటు కర్నాటక బ్యాంకు కూడా రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై వార్షిక వడ్టీ రేటును 3.5 శాతానికి తగ్గించాయి.