బిజినెస్

టిజిబిఎల్‌లో తగ్గిన ఎల్‌ఐసి వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ టాటా గ్లోబల్ బేవరేజెస్ లిమిటెడ్ (టిజిబిఎల్)లో తనకు గల వాటాలో 2.03 శాతం వాటాను ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) బహిరంగ మార్కెట్లో అమ్మేసింది. దీంతో టిజిబిఎల్‌లో ఎల్‌ఐసి వాటా 5.67 శాతానికి తగ్గిపోయింది. జూలై 4 నుంచి ఆగస్టు 23 మధ్య కాలంలో ఎల్‌ఐసి 1.28 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో అమ్మేసిందని, దీంతో తమ సంస్థలో ఎల్‌ఐసి వాటా 5.67 శాతానికి తగ్గిందని టిజిబిఎల్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)కి తెలియజేసింది. దేశంలోని బీమా సంస్థల్లో అతిపెద్దదైన ఎల్‌ఐసికి ఇంతకుముందు టాటా గ్లోబల్ బేవరేజెస్ లిమిటెడ్‌లో 9.85 శాతం వాటా ఉండేది. అయితే ఇందులో 2.14 శాతం వాటాను జూలై మాసంలో అమ్మేసి 7.70 శాతానికి కుదించుకున్న ఎల్‌ఐసి జూలై 4 నుంచి ఈ నెల 23వ తేదీ మధ్య కాలంలో మరో 2.03 శాతం వాటాను అమ్మేసింది. దీంతో టిజిబిఎల్‌లో ప్రస్తుతం ఎల్‌ఐసి వాటా 5.67 శాతానికి తగ్గిపోయింది.