బిజినెస్

స్వల్ప లాభాలకే మార్కెట్లు పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 24: అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్తబ్దుగా సాగాయి. అయితే దేశీయ మదుపరుల మద్దతుతో వరసగా మూడో రోజు కూడా స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకర్ల సదస్సు నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించడం కూడా మార్కెట్ల స్తబ్దతకు కారణమైనాయి. ఫలితంగా 31,678- 31,546 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బిఎస్‌ఇ సెనె్సక్స్ చివరికి 28 పాయింట్ల లాభంతో 31,596.06 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో సెనె్సక్స్ 309 పాయింట్లకు పైగా లాభపడిన విషయం తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 4.55 పాయింట్లు లాభపడి 9,857.05 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో సెనె్సక్స్ 71.38 పాయింట్లు, నిఫ్టీ 19.65 పాయింట్లు లాభపడ్డాయి. వినాయక చవితి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు. గత ఎనిమిది వారాల్లో సెనె్సక్స్, నిఫ్టీ సూచీలు లాభాల్లో ముగియడం ఇది ఏడో వారం. విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పిఐ)లు అమ్మకాలకే మొగ్గు చూపినప్పటికీ డొమెస్టిక్ ఇనె్వస్టర్లు కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు నిలదొక్కుకోగలిగాయి. బుధవారం కూడా ఎఫ్‌పిఐలు రూ.1157.52 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.
కాగా నందన్ నీలేకని మళ్లీ ఇన్ఫోసిస్‌లోకి రానున్న వార్తల కారణంగా ఆ సంస్థ షేరు 2 శాతానికి పైగా లాభపడింది. డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్‌ఫార్మా, లుపిన్ లాంటి హెల్త్‌కేర్ స్టాక్స్ కూడా బాగానే లాభపడ్డాయి. టాటామోటార్స్, టాటా స్టీల్, ఎస్‌బిఐ, ఎల్‌అండ్‌టి, పవర్‌గ్రిడ్ కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి. కాగా, హైవేలపై లిక్కర్‌షాపులపై నిషేధం మున్సిపల్ ప్రాంతాలకు వర్తించదన్న సుప్రీంకోర్టు వివరణతో లిక్కర్ కంపెనీలకు చెందిన షేర్లు గణనీయంగా పెరిగాయి. యునైటెడ్ స్పిరిట్స్ షేరు 3.89 శాతం పెరిగింది.