బిజినెస్

నెలనెలా జిఎస్‌టి సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిఎస్‌టి అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఇకమీదట ప్రతి నెలా వర్తక, వ్యాపార సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. శనివారం సచివాలయంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో, పత్తి, మిర్చి, పసుపు వ్యాపారులతో సమావేశమై చర్చించారు. వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. పత్తి, మిర్చి, పసుపు పంటలను రైతుల నుంచి కొనుగోలు చేసేటప్పుడు పన్ను కట్టడం వల్ల పెట్టుబడి వ్యయం బాగా పెరుగుతుందని వ్యాపారులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి తాము విక్రయించేటప్పుడే పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించాలని వారు మంత్రిని కోరారు. అందుకు మంత్రి ఈటల స్పందిస్తూ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. సోమేష్ కుమార్ మాట్లాడుతూ అవగాహన లేని వారికి వాణిజ్య పన్నుల శాఖ తరఫున అన్ని జిల్లాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. జిఎస్‌టితో రెండు, మూడు నెలలు ఇబ్బంది ఉన్నా.. ఆ తర్వాత అంతా సర్దుకుంటుం దన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.