బిజినెస్

మహానగరంలో ‘మంచి’నీటి పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: మహానగరంలో ఆకలితో అలమటించే వారికి పట్టెడన్నం పెట్టేందుకు కేవలం ఐదు రూపాయలకే ‘అన్నపూర్ణ’ భోజనాన్ని అందిస్తున్న జిహెచ్‌ఎంసి.. ఇప్పుడు అతి తక్కువ ధరకే నాణ్యమైన మంచినీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ‘ఎనీ టైం వాటర్’ కార్యక్రమం పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కియోస్క్‌ను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం ప్రారంభించారు. కేవలం రెండు రూపాయలకే లీటరు నీటిని, అలాగే 20 రూపాయలకే ఇరవై లీటర్ల మంచినీటిని ఈ పథకం ద్వారా అందించనున్నట్లు ఆయన తెలిపారు.
నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఏర్పాటుచేసిన ఈ ఎనీ టైం వాటర్ కియోస్క్‌ను కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి శనివారం మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ సంవత్సరానికి నగరంలో 200ల పైచిలుకు ఎనీటైం వాటర్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నీటిలో ఉన్న సహజసిద్దమైన మినరల్స్‌ను తొలగించకుండా స్వచ్ఛమైన నీటిని ఈ కియోస్క్‌ల ద్వారా ప్రజలకు అందించనున్నట్లు చెప్పారు. స్వీడన్‌కు చెందిన సుప్రసిద్ధ జోసబ్ ఇంటర్నేషనల్ సంస్థ అందించే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ తదితర సంస్థలు నిర్ధారించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఈ నీటిని అందించనున్నామన్నారు.
అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్‌ల ద్వారా అందించే జలాల్లో ఏ విధమైన రసాయనాలు ఉపయోగించకుండా, నీటిలోని సహజసిద్దమైన లవణాలు కోల్పోకుండా చేస్తామని తెలిపారు. ఈ కేంద్రాలకు తగినంత మంచినీటిని అందించేందుకు జలమండలి కూడా అంగీకరించినట్లు మేయర్ స్పష్టం చేశారు.

చిత్రం.. ఎనీ టైం వాటర్ కియోస్క్‌ను ప్రారంభిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, చిత్రంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు