బిజినెస్

పర్యాటకుల కోసం రోడ్‌షోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: భారత్ నుంచి మరింతగా పర్యాటకులను ఆకర్షించడానికి ఇజ్రాయెల్.. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రోడ్‌షోలు ఈ నెల 21న ముంబయిలో ప్రారంభమైయ్యాయి. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు మీదుగా జరిగి చైన్నైలో ఈ నెల 30న ఈ రోడ్‌షోలు ముగియనున్నాయి. కాగా, సోమవారం హైదరాబాద్‌లో ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ భారతీయ విభాగం డైరెక్టర్ హసన్ మధా విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాదిలో జూలై వరకు 34,000 మంది భారతీయులు ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారని, నిరుడుతో పోల్చితే 36 శాతం వృద్ధి నమోదైందన్నారు. ముఖ్యంగా జూన్‌లో పర్యాటకుల రద్దీ 79 శాతం పెరిగిందని తెలిపారు. 2016లో 44,672 మంది పర్యాటకులు భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చారన్న ఆయన డిసెంబర్ ఆఖరు నాటికి ఇజ్రాయెల్‌లో ఈ ఏడాది పర్యటించిన భారతీయుల సంఖ్య 55,000లకు చేరవచ్చన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ను సందర్శించడం వల్ల భారతీయులకు ఇజ్రాయెల్ పర్యటనపట్ల మక్కువ ఎక్కువైందన్నారు. పలు విమానయాన సంస్థలు భారత్‌లోని ప్రధాన నగరాల నుంచి ఇజ్రాయెల్‌కు నేరుగా సర్వీసులను నడుపుతున్నాయంటూ వాటి వివరాలను ఈ సందర్భంగా హసన్ చెప్పుకొచ్చారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఆహ్వానిస్తున్నామని, ఇజ్రాయెల్‌లో షూటింగ్‌లు జరిపేలా నిర్మాతలను ప్రోత్సహిస్తున్నామని కూడా హసన్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా లక్ష మంది భారత పర్యాటకులే ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న
ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ భారతీయ విభాగం డైరెక్టర్ హసన్ మధా