బిజినెస్

మెరిసిన ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 28: భారత్-చైనా సరిహద్దు ఆందోళనలు సద్దుమణిగిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 154.76 పాయింట్లు పెరిగి 31,750.82 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.75 పాయింట్లు అందుకుని 9,912.80 వద్ద నిలిచింది. ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, ఔషధ రంగాల షేర్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం ఆరంభం నుంచి సూచీలు లాభాల్లోనే కదలాడాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ షేర్ విలువ సోమవారం ట్రేడింగ్‌లో 3 శాతానికిపైగా కోలుకుంది. గతకొద్ది నెలలుగా సంస్థలో నెలకొన్న పరిణామాల మధ్య ఇన్ఫీ షేర్ విలువ క్రమేణా దిగజారినది తెలిసిందే. అయితే సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రావడంతో షేర్ విలువ పెరిగింది. బిఎస్‌ఇలో 941.15 రూపాయల వద్ద, ఎన్‌ఎస్‌ఇలో 941 రూపాయల వద్ద ఇన్ఫోసిస్ షేర్ విలువ నిలిచింది.