బిజినెస్

నేడు ఎన్‌టిపిసి ఆఫర్ ఫర్ సేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసిలో 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోంది. రెండు రోజుల ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఈ వాటాల విక్రయం జరగనుండగా, 7,000 కోట్ల రూపాయల నిధులను మోదీ సర్కారు సమీకరించనుంది. మంగళ, బుధవారాల్లో ఒఎఫ్‌ఎస్ జరుగుతుంది. ఒక్కో షేర్‌ను 168 రూపాయల చొప్పున అమ్మనున్నామని ఓ అధికారి సోమవారం తెలిపారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్‌లో ఎన్‌టిపిసి షేర్ విలువ సోమవారం 173.55 రూపాయల వద్ద ముగిసింది. దీంతో 3 శాతం రాయితీ ధరకు అమ్ముతున్నారు. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా 8,800 కోట్ల రూపాయల నిధులను కేంద్రం సమీకరించింది. ఇందులో స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుయుటిఐ) ద్వారా ఎల్‌అండ్‌టిలో వాటా అమ్మకంతోపాటు ఒక షేర్ బైబ్యాక్ కూడా ఉన్నాయి. మరోవైపు నాలుగు రక్షణ రంగ సంస్థల్లోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని కేంద్రం చూస్తుండగా, వాటిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ సంస్థలున్నాయ. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా ఈ సంస్థల్లో 25 శాతం మేర వాటాలను కేంద్ర ప్రభుత్వం అమ్మేయనుంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా 72,500 కోట్ల రూపాయలను ఖజానాకు తరలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశిత ఈ 72,500 కోట్ల రూపాయల నిధుల సమీకరణలో 46,500 కోట్ల రూపాయలను మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, 15,000 కోట్ల రూపాయలను వ్యూహాత్మక వాటాల అమ్మకం నుంచి, 11,000 కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్లలోకి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను పంపించడం ద్వారా అందుకోవాలని మోదీ సర్కారు చూస్తోంది.