బిజినెస్

రూ. 1,000 నోట్లు రావు: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: వెయ్యి రూపాయల నోట్లను తిరిగి చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 200 రూపాయల నోట్లను పరిచయం చేసిన నేపథ్యంలో వెయ్యి రూపాయల నోట్లూ మళ్లీ రానున్నాయన్న వార్తలు సోమవారం వచ్చాయి. అయితే దీనిపై మంగళవారం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ అలాంటిదేమీ లేదని ప్రకటించారు. నిరుడు నవంబర్ 8న నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనలో భాగంగా పాత పెద్ద నోట్ల (500, 1,000)ను మోదీ సర్కారు రద్దు చేసినది తెలిసిందే. వాటి స్థానంలోనే కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తెచ్చారు.
మరోవైపు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు జూలైలో 92,283 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. కేవలం 64.42 శాతం పన్ను చెల్లింపుదారులతోనే ఇంతగా జిఎస్‌టి ఆదాయం ఉండటంపట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆనందం వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వచ్చినది తెలిసిందే.