బిజినెస్

పెసల కొనుగోలుకు నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్రంలో రైతుల నుండి పెసలు కొనుగోలుకు టిఎస్ మార్క్‌ఫెడ్‌ను (తెలంగాణ స్టేట్ మార్కెట్ ఫెడరేషన్) నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. రైతులకు ధరల చేయూత పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీం) క్రింద ఈ బాధ్యతలను అప్పగించారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2017-18)కిగాను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) రైతులకు లభించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పంటల ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు, స్టేట్ డ్యూటీస్/పన్నులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. రైతులు పండించిన పెసలకు మంచి ధర ఇచ్చేందుకు వీలుగా మార్క్‌ఫెడ్ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్యదర్శి సి పార్థసారథి పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.