బిజినెస్

నోట్ల రద్దు జయప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతమైందని, రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అవినీతి, నల్లధనంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తున్న పోరాటాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోందని ఆయన చెప్పారు. ‘రద్దయిన పాత పెద్ద కరెన్సీ నోట్లలో దాదాపు 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయన్న వాస్తవం అవినీతి, నల్లధనంపై మోదీ ప్రభుత్వం జరుపుతున్న పోరాటాన్ని ప్రజలు ఆమోదించారని తేటతెల్లం చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతమైందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేందుకు, అక్రమ పద్ధతుల్లో వ్యాపారాన్ని జరుపుకునేందుకు ప్రజలను ప్రోత్సహించిన గత కాంగ్రెస్ సర్కారు మాదిరిగా కాకుండా నిజాయితీతో కూడిన పరిపాలన అందించే దిశగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. బ్యాంకుల్లోకి వచ్చి చేరుతున్న సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్న సాధారణ విషయాన్ని కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారని గోయల్ ఎద్దేవా చేశారు.