బిజినెస్

నల్లధనంపై పోరుకు మద్దతిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నల్లధనానికి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నల్లధనంపై భారత దేశం జరుపుతున్న పోరాటానికి మద్దతును కొనసాగించడానికి తమ దేశం కట్టుబడి ఉందని స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ అన్నారు. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలను శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని స్విస్ దౌత్య కార్యాలయంలో ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పారు. భారత దేశం స్విట్జర్లాండ్‌కు మంచి మిత్రురాలని, గత 70 ఏళ్లలో తాము ఒకరు చెప్పిన మాటను మరొకరు విన్నామని, పరస్పరం సలహాలు ఇచ్చుకున్నామని, ఒకరినుంచి మరొకరు ఎంతో నేర్చుకున్నామని ఆమె అన్నారు. ఈ పునాదిపైనే నేటి సంబంధాల భవనం నిలిచి ఉన్నదని కూడా ఆమె అన్నారు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా
నాలుగు రోజుల తన భారత పర్యటనలో ల్యూథర్డ్ ప్రధాని నరేంద్ర మోదీతో నల్లధనంపై పోరాటం, పలు రంగాల్లో సహకారం సహా అనేక అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. 70 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాల వేడుకలు 2018 దాకా కొనసాగుతాయి. ఈ వేడుకల ప్రారంభం సందర్భంగా ల్యూథర్డ్ రెండు దేశాలకు చెందిన పలువురు ‘ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్ల’ను సత్కరించారు. వారిలో ప్రముఖ ఆర్థిక వేత్త ఎంఎస్ స్వామినాథన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లో అవకాశాలు, దాని సంస్కృతిపైన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. స్విస్ రాయబార కార్యాలయంలోని సువిశాలమైన గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలు దేశల రాయబారులు, వాణిజ్యం, కళలు ఇతర రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

చిత్రం..న్యూఢిల్లీలోని స్విస్ దౌత్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హిందూస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ సిఎండీతో ముచ్చటిస్తున్న స్విస్ అధ్యక్షురాలు ల్యూథర్డ్