బిజినెస్

జరిమానా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: జూలై నెల జిఎస్‌టి రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయని వ్యాపారులకు విధించే లేట్ ఫైన్ (జరిమానా)ను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీంతో దాదాపు 20 లక్షల మంది వ్యాపారులకు ఊరట లభించనుంది. జూలై నెల జిఎస్‌టి రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 25. కాగా, అప్పటిలోగా రిటర్న్‌లు దాఖలు చేయని వారు ఆ తర్వాత దాఖలు చేసినట్లయితే రోజుకు రూ.200 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాను రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆలస్యంగా చెల్లించే బకాయిలపై వడ్డీని మాత్రం రద్దు చేయడం లేదని, వ్యాపారులు దాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘జూలై నెలకు సంబంధించి జిఎస్‌టిఆర్-3బి దాఖలు చేయని వ్యాపారులందరికీ విధించే లేట్ ఫీని మాఫీ చేయడమైనది. అయితే ఆలస్యంగా చెల్లించే బకాయిలపై వడ్డీని మాఫీ చేయలేదు. ఆగస్టు 25 లోగా జూలై నెలకు సంబంధించిన జిఎస్‌టి రిటర్న్‌లను దాఖలు చేయని వారందరికీ ఇది వర్తిస్తుంది’ అని ఆర్థిక శాఖ పలు ట్వీట్లలో తెలియజేసింది.
జూలై నెలకు సంబంధించి దాదాపు 60 లక్షల మంది వ్యాపారులు జిఎస్‌టి రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉండగా, చివరి తేదీ నాటికి కేవలం 40 లక్షల మందే రిటర్న్‌లు దాఖలు చేశారు. దీంతో 20 లక్షలకు పైగా వ్యాపారులు పెనాల్టీని ఎదుర్కొంటున్నారు. కాగా, జిఎస్‌టిఆర్-3బిలో తప్పులు చేసిన టాక్స్‌పేయర్లు జిఎస్‌టిఆర్ 1-2-3లో వాటిని సరిచేసుకోవచ్చని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది.