బిజినెస్

బ్రూట్ హై లైఫ్ బ్యాటరీస్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: సాంకేతికంగా అత్యున్నత ఉత్పత్తులు అందించడంలో భాగంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ అమరాన్ బ్రూట్ హై లైఫ్ బ్యాటరీలను ఆవిష్కరించింది. లాజిస్టిక్స్ పరిశ్రమకు అవసరమయ్యే ఈ కొత్త బ్యాటరీలను ఆవిష్కరించడంతో సాటిలేని కస్టమర్ సేవలను అందించినట్లు అయ్యిందని ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, సిఎంఓ శ్రీనివాస్ గంగ తెలిపారు. తయారీ, ప్రోసెసింగ్, వేర్‌హౌసింగ్ పరిశ్రమలో మోటార్ శక్తితో పని చేసే యంత్రాలకు అవసరమైన శక్తిని అందించే రీతిలో వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయడంతోపాటు బ్రిటిష్, డ్యూట్షీ ఇన్‌స్టిట్యూట్ ప్రమాణాలతో తయారు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మోటివ్ పవర్ పరిశ్రమలో ఉన్న ఖాళీలను సాంకేతికంగా అత్యున్నత ఉత్పత్తి ద్వారా పూరించనున్నట్లు వివరించారు.