బిజినెస్

మూడో వారమూ లాభాల్లోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 2: ఓ వైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం వరసగా మూడో వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధాన సూచీలయిన సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా గత వారం ఊపునే కొనసాగిస్తూ ఆల్‌టైమ్ హైకి చేరువయ్యాయి. డోక్లాంలో భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తత సద్దు మణిగిందంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది. ఫలితంగా సెనె్సక్స్ 296 పాయింట్లకు పైగా పెరిగి 31,892.23 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ సైతం 117 పాయింట్లకు పైగా పెరిగి 9,974.40 పాయింట్ల వద్ద ముగిసింది.
వినాయక చవితి కారణంగా వరసగా మూడు రోజుల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్లు భారీ లాభాలతో మొదలైనాయి. అయితే ఆ తర్వాత ఉత్తర కొరియా జపాన్‌పైకి క్షిపణిని ప్రయోగించిందన్న వార్త మదుపరుల్లో ఆందోళనకు కారణమైంది. ఈ వార్తకు స్పందించిన మార్కెట్లు మరుసటి రోజు 1 శాతానికి పైగా నష్టపోయాయి. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు. బుల్ ఆపరేటర్లు ఈ భయాలన్నిటినీ పక్కన పెట్టి కొనుగోళ్లకు దిగడంతో వారం మధ్యనుంచి మళ్లీ మార్కెట్లు పుంజుకున్నాయి. అయితే గురువారం ఆగస్టు నెల డెరివేటివ్స్ ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లకు గురయినప్పటికీ స్వల్ప లాభాలతోనే ముగిశాయి. అదే రోజు వెలువడిన జిడిపి వృద్ధి గణాంకాలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపించాయి. అయినప్పటికీ వారాంతం నాటికి లాభాలతో ముగియడం విశేషం. గత మూడు వారాల్లో సెనె్సక్స్ దాదాపు 679 పాయింట్లు లాభపడింది. ఒకటి, రెండు రంగాలు మినహాయించి రియల్టీ, మెటల్, ఆటో, ఎఫ్‌ఎంసిజి సహా దాదాపు అన్ని రంగాల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో కళకళలాడాయి. ఇక క్రితం వారం దేశీయ మార్కెట్లలో నష్టాలను చవి చూసిన బంగారం ధరలు గత సైతం బాగానే పెరిగాయి. విదేశీ మార్కెట్లలో స్థిరమైన ధోరణుల కారణంగా దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు పది నెలల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. వెండిధరలు సైతం తిరిగి 39 వేల రూపాయల స్థాయికి చేరుకున్నాయి.