బిజినెస్

విశాఖ మన్యంలో కాఫీ ఘుమఘుమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: ఈ ఏడాది కాఫీ పంట దిగుబడి మరింతగా పెరగనుంది. గిరిజన సహకార సంస్థ(జిసిసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదేళ్ళ కాఫీ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది దీనిని పెంచేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గత రెండేళ్ళ కంటే కూడా ఈసారి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. డిసెంబర్ నుంచి కాఫీ గింజలు సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందువల్ల ఇప్పటి నుంచే కాఫీ గింజల సేకరణ ఏ విధంగా చేపట్టాలి? గిరిజన రైతులను ప్రోత్సహించడం ఎలా? ఇతర దేశాలకు ఏ విధంగా ఎగుమతి చేయాలి? జిఎస్‌టితో ఎదురయ్యే సమస్యలేమిటి? కాఫీ పంట ఎగుమతిలో దళారులను నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? కాఫీ గింజల సేకరణ కోసం సిబ్బందికి ఏ విధంగా శిక్షణివ్వాలి? అనే అంశాలపైనే జిసిసి యాజమాన్యం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇందులోభాగంగా కాఫీ పంట ద్వారా గిరిజన రైతులకు ప్రయోజనం కల్పించాలని, ఇందుకోసం తొలుత దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించిన జిసిసి ‘పదేళ్ళ కాఫీ ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే దీనిని ప్రారంభించింది. ఐటిడిఏ, జిసిసి సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు వీలుగా కాఫీ పంటను విస్తరింపజేయగలిగింది.
ఏపీలో అధిక దిగుబడి వచ్చే అరకు, పాడేరు, చింతపల్లి, డుంబ్రిగుడ మండలాలకు సంబంధించి లక్ష ఎకరాల్లో కాఫీని రైతులతో పండించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జిసిసి ఈ క్రమంలో తొలి ఏడాదిలోనే విజయం సాధించింది. రెండు వేల టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా 1400 టన్నులకు పైగా గింజలను సేకరించగలిగింది. దీని ద్వారా 12కోట్ల రూపాయల మేర గిరిజన రైతులకు ప్రయోజనం కలిగింది. దీనివల్ల గత కొనే్నళ్ళుగా ఈ పంట ద్వారా లబ్ధి పొందుతూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్న దళారీ వ్యవస్థను నిర్మూలించినట్టు అయ్యింది. ఒకవైపు గిరిజన రైతులను ప్రోత్సహిస్తూనే దళారీ వ్యవస్థను నిర్మూలించగలిగిన జిసిసి సేకరించిన కాఫీ గింజలను దేశ, విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఏపీ కాఫీ ప్రతిష్ఠతను మరింతగా పెంచగలిగింది. గత ఏడాది పంట దిగుబడి పడిపోవడంతో కేవలం 400 టన్నులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఏడాది కాఫీ పంట ఆశాజనకంగా ఉండటంతో కనీసం రెండు వేల టన్నుల మేర సేకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గింజల సేకరణ కోసం అధికారులు, సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కాస్తంత ముందుగా శిక్షణిచ్చి, దళారులు జోక్యం లేకుండా గిరిజన రైతుల నుంచి నేరుగా దీనిని కొనుగోలు చేయడం వీరికి గిట్టుబాటు ధర కల్పిస్తూనే ఈ మొత్తాలను వీరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వంటివి చేపట్టనుంది.
దేశంలో రాష్ట్రాలతో ఏపీ పోటీ
భారతదేశంలో కాఫీ పంట దిగుబడి అత్యధికంగా కర్ణాటకలోనే అవుతుంది. దీని తరువాత తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు వస్తాయి. అయితే వీటిని అధిగమించి దేశంలోనే రికార్డును సృష్టించాలని జిసిసి ప్రయత్నాలు చేస్తోంది. విశాఖలో నిర్వహించిన బ్రిక్స్ సదస్సు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఇటీవల జరిగిన మహానాడు వంటి ముఖ్య కార్యక్రమాల్లో సైతం దేశ, విదేశీయులు సైతం ఇక్కడి కాఫీ రుచి చూశారు. దీంతో ప్రపంచ దేశాల్లో విశాఖ కాఫీకి విశేష ఆదరణ పెరిగింది. ఈ విధంగా దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్దపెద్ద మాల్స్‌కు, కార్పొరేట్ సంస్థల ద్వారాను కాఫీ గింజల అమ్మకాలు సాగించగలుగుతున్న జిసిసి ఇకపై మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించింది.
ఎగుమతులే ఎక్కువ
కాఫీ వాడకం భారతదేశంలో తక్కువే. జిసిసి అంచనా ప్రకారం పలు రాష్ట్రాల లెక్కల ప్రకారం కేవలం నాలుగు శాతం మంది ప్రజలు మాత్రమే కాఫీ ప్రియులున్నట్టు తేలింది. మిగిలిన 96 శాతం మేర కాఫీని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో పలు దేశాలు కాఫీ వ్యాపారాలను మరింతగా పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తుండగా వీటి మాదిరి జిసిసి పోటీ పడుతోంది.
ప్రపంచ దేశాల్లో ముందంజలో వియత్నాం
ప్రస్తుతం ప్రపంచదేశాల్లో పలు దేశాలకంటే కూడా వియత్నాం కాఫీ పంట సేకరణలో, వ్యాపార లక్ష్యాలు సాధించడంలోను ముందంజలో ఉంది. ఈ దేశంలో లేబర్ చార్జీలు తక్కువు ఉండటం, నిర్వహణ ఖర్చులు పెద్దగా ఉండకపోవడం, కాఫీ సైతం తక్కువ ధరకే లభించడం వంటి కారణాలతో వియత్నాం కాఫీకి ప్రపంచదేశాల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉండే బ్రెజిల్ కాస్త వెనకబడినట్టు తెలుస్తోంది. ఇంతవరకు కాఫీ అమ్మకాల్లో బ్రెజిల్‌తో పోటీ పడే దేశాలనేవి లేకపోగా, తొలిసారిగా వియత్నాం ముందంజలో నిల్చోగలుగుతోంది.
కాఫీకి జిఎస్‌టి దెబ్బ!
మన దేశంలో పండే కాఫీ గింజల ఎగుమతికి జిఎస్‌టి దెబ్బ తగిలిగింది. దీంతో వ్యాపార లక్ష్యాలు మందకోడిగా సాగుతున్నాయి. జిఎస్‌టి అమలు కారణంగా కర్ణాటక, తమిళనాడు నుంచి కాఫీ గింజల ఎగుమతి చేయడం నాలుగు మాసాలపాటు ఆగిపోయింది. వేలం కార్యక్రమాలు సైతం నిలిపివేశారు. దీనిపై స్పష్టత వచ్చిన తదుపరి మళ్ళీ ఈ మధ్య దీనికి కదలిక వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలోపెట్టుకున్న జిసిసి ఇక నుంచి అనేక రకాలుగా వ్యాపార లక్ష్యాలను పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రకాష్ రాష్టస్థ్రాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.