బిజినెస్

ఉద్యోగం పోయినా మూడేళ్లు జీవిత బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఖాతాదారులకు మూడేళ్లపాటు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) యోచిస్తోంది. ఇపిఎఫ్‌ఒ ట్రస్టీలు వచ్చే నెల సమావేశం అయ్యే వీలుండగా, ఈ సమావేశంలో ఈ ప్రతిపాదన పరిశీలనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ స్కీమ్ (ఇడిఎల్‌ఐ) ద్వారా అందే ప్రయోజనాన్ని కూడా 6 లక్షలకు పెంచనున్నారు. ప్రస్తుతం 3.6 లక్షల రూపాయలుగా ఉంది. ఇపిఎఫ్‌ఒ నిర్వహణలో ఐదు కోట్లకుపైగా ఉన్న ఖాతాదారులకు చెందిన 8.5 లక్షల కోట్ల రూపాయల నిధులున్నాయి. ఈ నిధులను స్టాక్ మార్కెట్లలోనూ పెట్టుబడిగా పెడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈక్విటీ మార్కెట్‌లో ఇపిఎఫ్‌ఒ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 6,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం వెల్లడించినది తెలిసిందే. అయితే ఈ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే నెల ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం వెలువడుతుందన్నారు. కాగా, నిరుడు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీలకు చెందిన ఎక్స్‌చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దాదాపు 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇపిఎఫ్‌ఒ పెట్టినది తెలిసిందే.