బిజినెస్

పులివెందుల పశు పరిశోధనా కేంద్రంలో వ్యాక్సిన్ల తయారీకి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 29: కడప జిల్లా పులివెందులలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ అధునాతన పశు పరిశోధనా కేంద్రాన్ని ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. అయతే ఇప్పుడిక్కడ పశు వ్యాక్సిన్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపికార్ల్ పరిశోధనా కేంద్రంగా పేరు మారగా, వ్యాక్సిన్ల తయారీతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తికిక్కడ ప్రయోగాలు జరగనున్నాయ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో 656 ఎకరాల్లో రూ. 254 కోట్లు ఖర్చుచేసి అంతర్జాతీయ స్థాయిలో ఈ పశుపరిశోధనా కేంద్రాన్ని నిర్మించారు. 2009లో పరిశోధనలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే వైఎస్ హఠాన్మరణం అనంతరం ఇద్దరు సిఎంలు మారినా ఆ పరిశోధనల గురించి పూర్తిగా పట్టించుకోలేదు. కాని ప్రస్తుత ప్రభుత్వం మాత్రం టీకాల ఉత్పత్తి, పశువుల పెంపకం, వ్యాక్సిన్ల తయారీ, కిట్ల పంపిణీపై దృష్టి సారించింది. అంతేగాక ఏపిఐఐసికి, సంబంధిత భవనాల కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడానికీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇటీవలే ఇక్కడ పరిశోధనలు మొదలు పెట్టేందుకు ఏపి కార్ల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా డాక్టర్ సోమశేఖర్‌ను నియమించింది. గత ఏడాది రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఈ కేంద్రానికి రూ. 18 కోట్ల నిధులు ఇవ్వడానికీ సమ్మతించారు. ఈ క్రమంలో తాజాగా పరిశోధనా కేంద్రంలో అంతర్జాతీయ సంస్థ జినోమిక్స్ పరిశోధనలు చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండి రత్నగిరి ఈ నెల 23న పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. ఈ పశు పరిశోధనా కేంద్రంలో 47 పెద్ద పెద్ద భవంతులతోపాటు 4 హోలితీయ ఆవులు, 400 పాడి ఆవులున్నాయ. అంతేగాక పశుగ్రాసం పెంపకానికి విశాలమైన పొలం సిద్ధంగా ఉంది. గతంలోనూ జినోమిక్స్, దొడ్లడైరీ, ఐమాక్స్ సంస్థలు పరిశోధనా కేంద్రంలో తమ ఉత్పత్తులు ప్రారంభిస్తామని సంప్రదింపులు చేశారు. ఈ పరిశోధనా కేంద్రంలో ఎస్‌టిఎఫ్, ఇటిపి, బిఎస్‌ఎల్, ఏబిఎస్‌ఎల్ ల్యాబ్‌లు ఉన్నాయి. కాగా, సుమారు రూ. 100 కోట్లతో టీకాల తయారీ, వ్యాధి నిర్ధారణ కిట్లను తయారుచేసి, వ్యాధి నివారణ వ్యాక్సిన్ తయారు చేయాలని జినోమిక్స్ కంపెనీ భావిస్తోంది. పశువుల పెంపకం, పశువుల దాణా, పశుగ్రాసం విషయంలోనూ ప్రాక్టికల్‌గా పరిశోధనలు చేసి ఈ కేంద్రంలో 80 రకాల గడ్డి జాతి మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. బయోటెక్ ఉత్పత్తుల్లో అగ్రగామి అయన జినోమిక్స్.. సముద్ర తీరాల్లో చనిపోయి కొట్టుకువచ్చిన చేపల ద్వారా వ్యాక్సిన్లు తయారుచేయడమేగాక పశువులకు వ్యాధి నిరోధక ప్రయోగాలు, వ్యాక్సిన్లు, ఎటువంటి దాణా పశువులకు ఇస్తే ఆరోగ్యంగా ఉంటాయోననే పరిశోధనలు చేస్తుంది. అలాగే పాల ఉత్పత్తిలో వెన్నశాతం పెంచడానికి ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఇక్కడికి దేశ, విదేశాలకు చెందిన పశువైద్య విశ్వవిద్యాలయాల నుంచి వైద్యులు, శాస్తవ్రేత్తలు, యవ శాస్తవ్రేత్తలను రప్పించనున్నారు. ప్రపంచ దేశాల్లో గేదెలు, ఆవుల రకాలను గుర్తించి వాటికి దీటుగా మేలైన రకాల పశువులను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ కిట్లు వచ్చేవి. వివిధ జబ్బులపై ప్రత్యేక శిక్షణను రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించేవారు. విభజన అనంతరం నూతన రాష్ట్రంలో పశువైద్య కళాశాలలు ఉన్నాయే తప్ప పరిశోధనా కేంద్రాలు లేవు. ఈ నేపథ్యంలో పులివెందులలో నిర్మించిన అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది.

పులివెందుల అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం