బిజినెస్

ఎఎస్‌పి, జిఎస్‌పి సేవలను అందించేందుకు బిఎస్‌ఎన్‌ఎల్‌తో టాక్స్‌మాన్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: అధీకృత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సువిధ ప్రొవైడర్స్ (జిఎస్‌పి)లో ఒకటైన టాక్స్‌మాన్ శుక్రవారం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కార్పొరేట్స్, ఎస్‌ఎంఈలు తమ జిఎస్‌టి కాంప్లియెన్స్ నిర్వహించేందుకు వీలుగా టాక్స్‌మాన్ బిఎస్‌ఎన్‌ఎల్ ఒన్ సొల్యూషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరిస్తున్నట్లు టాక్స్‌మాన్ డిజిఎం ఆదిత్య సింఘానియా తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు అతి సులభంగా తమ విధులను ముగించుకోవడానికి భరోసా కల్పించడమే కాదని, విస్తత్ర స్థాయిలో ఇంపోర్టు సామర్ధ్యాన్ని ఏదైనా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్, ఇఆర్‌పి నుంచి దిగుమతి చేసుకునే సౌలభ్యం కల్పిస్తుందని తెలిపింది. బిఎస్‌ఎన్‌ఎల్‌తో భాగస్వామ్యం ద్వారా ఏపి, తెలంగాణ మార్కెట్లో 60 శాతం వాటాను రాబోయే ఆరు నెలల్లో సొంతం చేసుకునే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. జిఎస్‌టి రిటర్న్స్ దాఖలు చేయడంలో కఠినతరమైన నిబంధనలు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సుజాత వెంకటేశ్వరన్ మాట్లాడుతూ, అతి చిన్న వ్యాపారి సైతం ఐటి నైపుణ్యం పట్ల కొద్దిపాటి అవగాహన ఉన్నప్పటికీ సులభంగా జిఎస్‌టి రిటర్న్సు ఫైల్ చేసేందుకు వీలుగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దామని చెప్పారు.
103 కాయిన్ ఎక్చేంజ్ మేళాలను
నిర్వహించిన ఐసిఐసిఐ బ్యాంక్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 103 కాయిన్ ఎక్చేంజ్ మేళాలను నిర్వహించినట్లు ఐసిఐసిఐ బ్యాంక్ వెల్లడించింది. దీనిలో పాల్గొన్న 1000 మంది వినియోగదారులు 60 లక్షల రూపాయల విలువైన నాణేలను మార్చుకున్నారని తెలిపింది. ఈ స్కీము ద్వారా ప్రజలకు తమ వద్ద ఉన్న నోట్లను ఉచితంగా నాణేల రూపంలోకి మార్చుకునే వీలు కలిగించినట్లు ఆ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.