బిజినెస్

గత రెండేళ్లలో జౌళి రంగానికి మూడు రెట్ల ఎఫ్‌డిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశ జౌళి రంగంలోకి గత రెండేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) మూడు రెట్లు పెరిగాయని, దీంతో ఈ రంగం పట్ల విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత బలపడిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) న్యూఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన భారత ఆర్థిక శిఖరాగ్ర సదస్సులో శుక్రవారం జరిగిన చర్చా కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంఎంఎఫ్ (మ్యాన్ మేడ్ ఫైబర్) రంగ సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ గ్రూపు (ఐఎంజి)ను ఏర్పాటు చేసిందని, కనుక ఆ రంగానికి అతి త్వరలో ‘శుభవార్త’ అందుతుందని ఆమె అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించలేదు. ‘ఎంఎంఎఫ్ రంగం సామర్ధ్యాన్ని పెంపొందించి, ఆ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల రేట్లను పోటీకి అనువుగా మార్చేందుకు అవసరమైన సూచనలను ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం తొలిసారి అంతర్ మంత్రిత్వ గ్రూపును ఏర్పాటు చేసింది. కనుక ఎంఎంఎఫ్ రంగానికి అతి త్వరలో ‘తీపి కబురు’ అందుతుందని నేను భావిస్తున్నా’ అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.