బిజినెస్

చక్కెర ధరల అదుపుపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: మార్కెట్‌లో మండిపోతున్న చక్కెర ధరలను శాంతింపజేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న చక్కెరపై సుంకాన్ని తగ్గించాలని భావిస్తున్న మోదీ సర్కారు.. ప్రస్తుతమున్న ధరలు మరింతగా పెరిగితే దేశం నుంచి విదేశాలకు జరిగే ఎగుమతులను నిషేధించాలని కూడా యోచిస్తోంది.
నిజానికి రిటైల్ ధర కిలో 40 రూపాయలను దాటిపోవడంతో ప్రభుత్వం ధరల అదుపు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. గడచిన కొద్దివారాల్లో వ్యాపారుల వద్ద చక్కెర నిల్వలకు పరిమితి విధించడంతోపాటు మిల్లులకు చక్కెర ఉత్పత్తికిగాను ఇస్తున్న 4.50 రూపాయల (కిలోకు) రాయితీని ఉపసంహరించుకుంది.
‘చక్కెర ధరలను అదుపు చేసేందుకున్న అన్ని చర్యలను మేము తీసుకుంటాం. మార్కెట్‌లో ప్రస్తుత స్థాయిని మించి ధరలు పెరిగితే దిగుమతి సుంకాన్ని తగ్గించి, ఎగుమతులను నిలిపివేస్తాం.’ అని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శనివారం ఇక్కడ జరిగిన రాష్ట్రాల ఆహార మంత్రుల సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.
మిలర్ల వద్దనున్న చక్కెర నిల్వలపైనా నిఘా పెట్టాలని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నామని చెప్పారు. ప్రస్తుత 2015-16 పంట సంవత్సరంలో చెరకు ఉత్పత్తి గతంతో పోల్చితే 11 శాతం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్‌లో కిలో చక్కెర ధర గత రెండు నెలలుగా 40 రూపాయలు పలుకుతోంది. ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇదిలావుంటే మార్కెట్‌లో ఇంకా తగ్గని పప్పు్ధన్యాల ధరలను కిందికి దించేందుకు పప్పులపై పన్నులు వేయవద్దని రాష్ట్రాలను పాశ్వాన్ కోరారు. వ్యాట్, మార్కెట్ ఫీజుల వంటివి వేయవద్దని, అలాగే అక్రమ నిల్వలపై దృష్టి సారించి దాడులు నిర్వహించాలని, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కాగా, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 1.5 లక్షల టన్నులుగా ఉన్న పప్పు్ధన్యాల నిల్వల సామర్థ్యాన్ని 9 లక్షల టన్నులకు పెంచడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఆహార రాయితీ కోసం కూడా నగదు బదిలీ పథకాన్ని (డిబిటి) అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. వంటగ్యాస్‌పై ఎలాగైతే డిబిటిని వినియోగిస్తూ రాయితీని అందిస్తున్నామో, అలాగే ఆహార రాయితీని అందించాలని పాశ్వాన్.. ధరల పెరుగుదలపై రాష్ట్రా ల ఆహార మంత్రులతో నిర్వహించిన సమావేశంలో సూచించారు.

చిత్రం రాష్ట్రాల ఆహార మంత్రుల సమావేశంలో మాట్లాడుతున్న పాశ్వాన్