బిజినెస్

ఆపిల్ డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: అంతర్జాతీయ టెక్ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ భారత్‌లో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు కొన్ని రాయితీలను కోరుతోందని, ఈ రాయితీలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం) కార్యదర్శి రమేష్ అభిషేక్ వెల్లడించారు. దేశంలో ఇప్పటికే 90 మొబైల్ సంస్థలు హ్యాండ్‌సెట్లను తయారు చేస్తున్నాయని ఆయన తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆపిల్ చేసిన ప్రతిపాదనలేమిటని విలేఖరులు ప్రశ్నించగా, ‘ఆ సంస్థ కొన్ని రాయితీలను కోరుతోంది. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే 90 మొబైల్ సంస్థలు హ్యాండ్‌సెట్లను తయారు చేస్తున్నాయి. దీంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మరింత బలంగా ముందుకు సాగుతోంది’ అని రమేష్ అభిషేక్ చెప్పారు. మన దేశంలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆపిల్ పలు డిమాండ్లు చేస్తోందని, అయితే వీటిలో చాలా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదని ఈ ఏడాది మార్చి నెలలో అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు తెలిపారు. భారత్‌లో తమ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి, రిపేరుతో పాటు వాటికి అవసరమైన యంత్ర సామగ్రిని ఏర్పాటు చేసుకునేందుకు 15 ఏళ్ల పాటు పన్ను రాయితీలు ఇవ్వాల్సిందిగా ఆపిల్ సంస్థ కోరిందని నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా తెలిపారు.

చిత్రం.. డిఐపిపి కార్యదర్శి రమేష్ అభిషేక్