బిజినెస్

లక్ష్యం రూ. 500 కోట్ల టర్నోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, అక్టోబర్ 9: గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జిఎన్‌ఎఫ్‌సి) తన వేప ఆధారిత ఉత్పత్తుల ద్వారా రానున్న మూడేళ్లలో తన వ్యాపార మొత్తాన్ని (టర్నోవర్‌ను) రూ. 500 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సోమవారం తెలిపింది. తన ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుండడంతో వేప ఉత్పత్తుల పరిధిని విస్తరించాలని, ఈ ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచాలని జిఎన్‌ఎఫ్‌సి నిర్ణయించినట్లు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ గుప్తా ఇక్కడ ఒక వార్తాసంస్థకు చెప్పారు. వేపతో తయారు చేసిన హ్యాండ్ వాష్, షాంపూ, ఇతర ఉత్పత్తులు తమ కంపెనీ టర్నోవర్ వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్లకు చేరడానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మూడు వేలకు పైగా రిటైల్ ఔట్‌లెట్లలో జిఎన్‌ఎఫ్‌సి తయారు చేసిన వేప ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బిగ్ బజార్, స్టార్ బజార్, కేంద్రీయ భండార్, ఫ్లిప్‌కార్ట్ వంటివి ఈ ఉత్పత్తులను అమ్ముతున్న వాటిలో ఉన్నాయి. జిఎన్‌ఎఫ్‌సి 2015లో రూ. 50 కోట్ల పెట్టుబడితో ‘నీమ్ ప్రాజెక్టును ప్రారంభించింది.