బిజినెస్

2% తగ్గిన టిసిఎస్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నికర లాభం 2.1 శాతం తగ్గి రూ.6.446 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,586 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ బిఎస్‌ఇకి తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో తమకు రూ.30,541 కోట్ల రెవెన్యూ వచ్చిందని, గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.29,284 కోట్ల రెవెన్యూ కంటే ఇది 4.3 శాతం ఎక్కువ అని టిసిఎస్ తెలిపింది. అదేవిధంగా షేరుకు 7 రూపాయల చొప్పున డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. ద్వితీయ త్రైమాసికంలో వస్తు డిమాండ్ అన్నివిధాలుగా పెరగడం కూడా వృద్ధి పరిమాణం కూడా విస్తరించిందని టిసిఎస్ తెలిపింది. డిజిటల్ మార్కెట్‌లో తమ కంపెనీ వాటా విస్తరిస్తోందని టిసిఎస్ సిఇఓ రాజేష్ గోపీనాథ్ వెల్లడించారు. అలాగే తమ పెట్టుబడుల కార్యక్రమాన్ని కూడా మరింతగా విస్తరిస్తున్నామని, డిజిటల్ డిజైనింగ్, పరివర్తనాత్మక సామర్ధ్యాల్లో పెడుతున్న పెట్టుబడులు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే డిజిటల్ వ్యాపారంలో తమ వృద్ధిరేటు నిలకడగా పెరుగుతోందని టిసిఎస్ సిఎఫ్‌ఓ వి.రామకృష్ణన్ తెలిపారు. టిసిఎస్ డిజిటల్ రెవెన్యూ ఏటేటా 31 శాతం మేర పెరుగుతోందని, మొత్తం కంపెనీ రెవెన్యూలో దీని వాటా 19.7 శాతమని వివరించారు.