బిజినెస్

కాంపోజిషన్ స్కీమ్‌పై సర్కారు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: జిఎస్‌టి కాంపోజిషన్ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఇటీవల ఏర్పాటైన మంత్రుల గ్రూపు (జిఓఎం) కేవలం వారం రోజుల వ్యవధిలోనే తొలి సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన కొద్ది రోజుల క్రితం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో ఈ మంత్రుల గ్రూపును ఏర్పాటు చేసిన విషయం విదితమే. రెస్టారెంట్లకు సంబంధించిన వస్తు, సేవల పన్ను రేట్లను సమీక్షించే బాధ్యతను కూడా జిఓఎంకు అప్పగించారు. జిఎస్‌టి కింద రిజిస్టర్ అయిన దేశంలోని మొత్తం 98 లక్షల మంది వ్యాపారుల్లో కేవలం 15 లక్షల మంది మాత్రమే కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవడంతో ఈ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అనుసరించాల్సిన మార్గాలను పరిశీలించేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేయాలని జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించింది. సంవత్సరానికి రూపాయల వరకు టర్నోవర్‌ను కలిగివున్న సంస్థలు, వ్యాపారులు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకునేందుకు వీలుంటుంది. దీంతో వారు 1 నుంచి 5 శాతం మేరకు పన్ను చెల్లించడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి రిటర్న్‌లు దాఖలు చేస్తే సరిపోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ నెల 7వ తేదీన జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం నిర్ణయం మేరకు ఏర్పాటైన ఈ మంత్రుల గ్రూపు నవంబర్ నెలాఖరు నాటికి తమ నివేదికను సమర్పించనుంది. ఈ మంత్రుల గ్రూపులో హిమంత బిశ్వ శర్మతో పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ, జమ్మూ-కాశ్మీరు, పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రులు హసీబ్ ద్రబు, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, చత్తీస్‌గఢ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్ సభ్యులుగా ఉన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన రెస్టారెంట్ల పన్ను స్వరూపాన్ని సమీక్షించి, వాటి పన్ను రేట్లను హేతుబద్ధీకరించే లేదా తగ్గించే బాధ్యతను కూడా మంత్రుల గ్రూపునకు అప్పగించారు. ప్రస్తుతం జిఎస్‌టిలో నాన్-ఏసి రెస్టారెంట్లకు 12 శాతం, ఏసి రెస్టారెంట్లకు 18 శాతం చొప్పున ప్రభుత్వం పన్ను విధించిన విషయం తెలిసిందే.