బిజినెస్

పెరిగిన నిఫ్టీ... తగ్గిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ ఇనె్వస్టర్ల కొనుగోళ్ల దన్ను ఒకపక్క, కార్పొరేట్ ఫలితాల ఊతం మరొకపక్క నిఫ్టీకి మంగళవారం కూడా మరింత వనె్ననిచ్చాయి. సోమవారం నాటి రికార్డును అధిగమిస్తూ మంగళవారం 3.60 పాయింట్లు పెరిగి 10,234.45 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటి లావాదేవీలతో పోలిస్తే సెనె్సక్స్ 0.04 శాతం పుంజుకున్నట్లయింది. గత రెండు రోజులుగా ఉత్సాహంతో పరుగులెత్తిన సెనె్సక్స్ వేగం మంగళవారం తగ్గింది. లావాదేవీలు మొదలైనప్పటినుంచి వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ ఒక దశలో 32,699.86 పాయింట్ల వరకు చేరుకుని చివరికి ఇనె్వస్టర్ల లాభాల స్వీకరణతో 24.48 పాయింట్లు తగ్గి 32,609.16 పాయింట్ల వద్ద ముగిసింది. స్వదేశీ ఇనె్వస్టర్ల కొనుగోళ్లు నిఫ్టీకి మరింత బలాన్ని చేకూర్చడంతో పాటు వివిధ కీలక షేర్ల విలువ పెరగడానికే దారితీసింది. ఈ వారం ఎక్కువ రోజులు సెలవులే కావడం వల్ల ఇనె్వస్టర్లు కూడా కొత్త పెట్టుబడులు, అలాగే కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. మార్కెట్ పరిస్థితి వివిధ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. దీపావళి అనంతరమే మార్కెట్ ఏ పథంలో ముందుకు వెళుతుందన్నది స్పష్టమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేటి లావాదేవీల్లో స్వదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు దాదాపు 272.69 కోట్ల నికర విలువతో షేర్లను కొనుగోలు చేశారు. అలాగే విదేశీ పోర్ట్‌పోలియో ఇనె్వస్టర్లు సోమవారం 29.92 కోట్ల రూపాయల మేర షేర్లను విక్రయించినట్లుగా మార్కెట్ వివరాలను బట్టి తెలుస్తోంది. నేటి సెనె్సక్స్ లావాదేవీల్లో సిప్లా మరింత పుంజుకుని గతం కంటే తన షేర్ల విలువను 4.09 శాతం మేర పెంచుకుంది. అలాగే భారతి ఎయిర్‌టెల్ షేర్ల విలువ 2.86 శాతం పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టిసిఎస్, ఎల్ అండ్ టి, ఎన్‌టిపిసి, మారుతి సుజుకి షేర్లు 2.06 శాతం వరకు పుంజుకున్నాయి.