బిజినెస్

నిలిచిన కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 20: ప్రపంచ మార్కెట్‌లో ఈ ఏడాది వాణిజ్య పంటలు మిర్చి, పసుపు ఉత్పత్తులకు గిరాకీ ఉంది. ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ దేశీయంగా ఈ-నామ్ తాకిడికి లావాదేవీలలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.. కొత్తగా ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-నామ్ విధానం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 545 మార్కెట్ యార్డులలో అమలులో ఉంది. అయితే సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలు కావటంలేదు. ప్రస్తుతం ఈనామ్‌కు సంబంధించి సర్వర్లు పనిచేయకపోవటంతోపాటు ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు అందకపోవటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గుంటూరు మిర్చి యార్డు ఆసియా దేశాలోకెల్లా ప్రధానమైంది. ఇక్కడి 20కి పైగా మిర్చి రకాల ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాచుర్యం పొందాయి. నిత్యం లక్షలాది టిక్కీల విక్రయాలు జరుగుతుంటాయి. గత ఏడాది కోటీ 20లక్షల టిక్కీల మేరకు ఎగుమతులు జరిగాయి. ఈ సారి రెండుకోట్ల టిక్కీలను ఎగుమతి చేయాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద సరకు లేకపోయినా కోల్డు స్టోరేజీలలో 50 లక్షల క్వింటాళ్ల మేర నిల్వలు పేరుకుపోయాయి. గత కొద్దిరోజుల క్రితం వరకు ఈనామ్‌కు వ్యతిరేకంగా వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. మిర్చికి సంబంధించి 20 రకాలను సిస్టంలో పొందు పరచటంతో పాటు ఈనామ్ పద్దతిలో రైతుల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల అనుసంధానం తదితర అంశాలలో వ్యాపారులు పేచీపెట్టారు. రైతులు తమ వద్ద ముందే అప్పులు తీసుకుంటారని, ఈనామ్ ద్వారా చెల్లింపులు అసాధ్యమని భీష్మించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనల కారణంగా ప్రత్యామ్నాయంలేక ఈనామ్ కొనుగోళ్లకే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొగ్గుచూపింది. దీంతో మిర్చి యార్డులో కొనుగోళ్లు నామమాత్రంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండి ప్రపంచ మార్కెట్‌లో కూడా పరిస్థితులు అనుకూలించడంతో రైతులు తమకు మంచి ధర పలుకుతుందని ఆశిస్తున్నారు. అయితే ఈనామ్ కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరగటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరో రెండు నెలలు గడిస్తే కొత్తపంటను యార్డుకు తరలించాల్సి ఉన్న నేపథ్యంలో కొనుగోళ్లలో మాంద్యం ఏర్పడితే ఎలా గట్టెక్కుతామనే నిరాశ, నిట్టూర్పు విడుస్తున్నారు. దీంతో మార్కెటింగ్ అధికారులు ఈనామ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఎన్‌ఎఫ్‌టిఎల్ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నారు. ఇలాఉంటే గత నెలరోజులుగా గుంటూరు జిల్లా దుగ్గిరాల యార్డులో పసుపు కొనుగోళ్లను కూడా వ్యాపారులు నిలిపివేశారు. అయితే రైతుల వద్ద ఉన్న సరకును ఇప్పటికే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. దుగ్గిరాల పసుపు ఉత్పత్తులకు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో పేరుంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మయన్మార్ గల్ఫ్ దేశాలకు పసుపు ఎగుమతి అవుతుంది. ఏటా 6లక్షల క్వింటాళ్ల మేర రవాణా అవుతోంది. పసుపులో ఉండే కర్క్‌మిన్ అనే రసాయన పదార్థం ఔషధ తయారీకి ఫార్మారంగంలో వినియోగిస్తారు.
ఇది ఇలావుంటే అమెరికా, తదితర ప్రముఖ దేశాలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతాయి. ప్రస్తుతం రైతుల వద్ద 50వేలు, కోల్డుస్టోరేజీలలో లక్షన్నర క్వింటాళ్ల వరకు నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాది పంట చేతికి అందేలోపు ఉన్న సరకును విక్రయిస్తేనే రైతులకు వెసులుబాటు కలుగుతుందని చెప్తున్నారు. అయితే ఈనామ్ కారణంగా ఎక్కడి లావాదేవీలు అక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఎగుమతులు ఊపందుకున్నాయి. ఆయా దేశాలలో వరదలు, వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు వాణిజ్య పంటల ఎగుమతులకు మార్గం సుగగమైంది. ఈనామ్‌తో తలెత్తిన పేచీలను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించ గలిగితే తమకు వెసులుబాటు కలుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.