బిజినెస్

ఈయును వీడితే దుష్ప్రభావాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 23: యూరోపియన్ యూనియన్ (ఈయు)ను వీడితే.. బ్రిటన్ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ దేశ ఆర్థిక మంత్రి జార్జ్ ఆస్బర్న్ హెచ్చరించారు. మరో నెల రోజుల్లో ఈయులో బ్రిటన్ సభ్యత్వంపై రెఫరెండమ్ జరగనున్న క్రమంలో ‘ఆర్థిక మాంద్యానికి ఓటేద్దామా?’ అని ప్రతి బ్రిటన్ పౌరుడు తమకు తాము తప్పక ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం రెఫరెండానికి సంబంధించి నిర్వహించిన ప్రచారంలో ఆస్బర్న్ అన్నారు. ఈయు నుంచి వైదొలగాలని బ్రిటన్ ప్రజలు కోరుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థపై తక్షణమే తీవ్ర దుష్ప్రభావాలు చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జిడిపి వృద్ధిరేటు పడిపోతుందన్నారు.