బిజినెస్

చబహర్‌కు భారత్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, మే 23: సుధీర్ఘకాలం అనంతరం భారత ప్రధాన మంత్రి ఇరాన్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సోమవారం 12 ఒప్పందాలు, ఎమ్‌ఒయులు కుదిరాయి. బిజెపికి చెందిన నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పాయి తర్వాత 15 ఏళ్లకు మళ్లీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన ప్రధాని.. నరేంద్ర మోదీ ఈ ఇస్లామిక్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక, వాణిజ్య, రవాణా, పోర్టుల అభివృద్ధి, సాంస్కృతిక, శాస్ర్తియ, విద్యా సహకారానికి సంబంధించి ఒప్పందాలు, ఎమ్‌ఒయులను ఇరు దేశాలు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహని సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ఆయా శాఖల అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఎమ్‌ఒయులపై సంతకాలు చేశారు. ఇందులోభాగంగానే వ్యూహాత్మక చబహర్ పోర్టు అభివృద్ధికి ఒప్పందమైంది. భారత జాయింట్ వెంచర్ ద్వారా ఇరాన్ దక్షిణ తీరంలో ఉన్న చబహర్ పోర్టు తొలి దశ అభివృద్ధి కోసం ఓ కాంట్రాక్టు కుదిరింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 150 మిలియన్ డాలర్ల రుణ సాయానికీ భారత్‌తో ఇరాన్ ఒప్పందం చేసుకుంది. అలాగే అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాలకు రైల్వే మార్గం ద్వారా భారత్ ప్రవేశానికి జరిగిన ఒప్పందం కూడా ఒకటి ఉంది. ఆగ్నేయ ఇరాన్‌లోని చాహ్ బహర్ సముద్ర తీరంలోగల చబహర్ పోర్టు నుంచి జహెదాన్‌కు రైల్వే లైన్ ఏర్పాటుకు ఐఆర్‌సిఒఎన్ ఒప్పందం చేసుకుంది. 1.6 బిలియన్ డాలర్లతో 500 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్.. అప్ఘనిస్తాన్‌కు రవాణా కారిడార్‌లో భాగంగా ఏర్పాటవుతోంది. ఇక ఇరాన్ చౌకగా అందించే సహజ వాయువుతో చబహర్ స్వేచ్ఛా వాణిజ్య మండలి వద్ద 0.5 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఓ అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటుకున్న అవకాశాలపై ఓ అవగాహన ఒప్పందాన్ని (ఎమ్‌ఒయు) భారత ప్రభుత్వరంగ సంస్థ నాల్కో చేసుకుంది. ఇరాన్ ఎక్స్‌పోర్ట్ గ్యారెంటీ ఫండ్, భారత ఎక్స్‌పోర్ట్ గ్యారెంటీ కార్పొరేషన్ మధ్య కూడా మరో ఎమ్‌ఒయు కుదిరింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్యా విధానపరమైన చర్చల కోసం ఎమ్‌ఒయుపై సంతకాలు జరిగాయి. భారత విదేశీ సేవల సంస్థ, ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సంబంధాల పాఠశాల మధ్య మరో ఎమ్‌ఒయు జరిగింది. ఇరాన్ శాస్త్ర, సాంకేతిక, పరిశోధన మంత్రిత్వ శాఖ, భారత శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖల మధ్య ఓ ఎగ్జిక్యూటివ్ ప్రోటోకాల్‌పై సంతకాలు జరిగాయి. ఇరాన్ జాతీయ లైబ్రరీ, భారత జాతీయ ఆర్చివ్స్ మధ్య కూడ ఎమ్‌ఒయు చేసుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇరాన్ ఇస్లామిక్ కల్చర్ అండ్ రిలేషన్స్ ఆర్గనైజేషన్ మధ్య, ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ గైడెన్స్, భారత సాంస్కృతిక శాఖ మధ్య కూడా ఎమ్‌ఒయులు కుదిరాయి.

chitram మోదీ, రౌహని సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న అధికారులు