బిజినెస్

ఉత్తర ఆఫ్రికా దేశాల్లో 30 నుంచి అన్సారీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలోని మొరాకో, ట్యునీషియా దేశాల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, కొత్త రంగాలకు సహకారాన్ని విస్తరించుకునేందుకు అవకాశాలను అనే్వషించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. మొరాకో ప్రధాన మంత్రి అబ్దెలిల్హా బెన్కిరానే ఆహ్వానం మేరకు అన్సారీ ఈ నెల 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటిస్తారని, ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకులు రబత్‌లో ఇండియా-మొరాకో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడం, పరస్పర ప్రయోజనం కలిగించే వివిధ రంగాలకు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని విస్తరించుకునేందుకు అవకాశాలను అనే్వషించుకోవడమే లక్ష్యంగా మొరాకోలో పర్యటించనున్న అన్సారీ వివిధ అంశాలపై ఆ దేశ రాజు మొహమ్మద్-6తో పాటు ప్రధాన మంత్రి బెన్కిరానేతో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల శాఖ వివరించింది. ఈ పర్యటన ముగిసిన ట్యునీషియా ప్రధాన మంత్రి హబీబ్ ఎస్సిద్ ఆహ్వానం మేరకు అన్సారీ జూన్ 2 నుంచి 3వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం, అభివృద్ధికి అవకాశం ఉన్న ఇతర రంగాలకు సహకారాన్ని విస్తరించుకోవడంపై ట్యునీషియా నాయకులతో అన్సారీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వివరించింది.