బిజినెస్

దేశీయ జౌళి రంగానికి ఎమిరేట్స్‌లో విస్తృత అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: దేశంలోని జౌళి, వస్త్రాల తయారీ రంగాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విస్తృతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఎఫ్‌ఐఇఓ (్భరత ఎగుమతిదారుల సమాఖ్య) స్పష్టం చేసింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ అపారెల్ అండ్ టెక్స్‌టైల్ ఫెయిర్‌లో మన దేశానికి చెందిన 112 మంది సభ్యులతో కూడిన వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని, గత ఏడాది యుఎఇకి మన దేశం నుంచి 32 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని ఎఫ్‌ఐఇఓ ఒక ప్రకటనలో వివరించింది. అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల వ్యాపారాన్ని పెంపొందించేందుకు భారత జౌళి రంగంతో యుఎఇ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఎఫ్‌ఐఇఓ సదరన్ రీజియన్ ప్రాంతీయ చైర్మన్ ఎ.శక్తివేల్ ఉద్ఘాటించారు. మన దేశానికి లభిస్తున్న మొత్తం విదేశీ మారక ద్రవ్యంలో దాదాపు 27 శాతం జౌళి ఎగుమతుల ద్వారానే వస్తోందని, దేశంలోని మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 14 శాతం వాటా కలిగివున్న జౌళి రంగం ప్రత్యక్షంగా 3.5 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, దేశంలోని మొత్తం ఉపాధి అవకాశాల్లో ఈ రంగం వాటా 21 శాతం వరకు ఉందని ఆయన వివరించారు.