బిజినెస్

ద్రవ్యోల్బణం, చమురు ధరలే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: అక్టోబర్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు, అలాగే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న చమురు ధరల ధోరణులు ఈ వారం భారత స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో ఎదురైన ఒడిదుడుకుల నుంచి మార్కెట్లు కోలుకున్నట్లు కనిపిస్తోందని, అయితే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల కొనసాగినట్లయితే మార్కెట్ల స్థిరీకరణ మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుందని, అలాగే వినిమయ ధరల సూచీ (సిపిఐ), టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) లాంటి కీలక గణాంకాలు కూడా ఈ వారం స్టాక్ మార్కెట్ల గమనంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తెలిపారు. ఐడియా సెల్యులార్, జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి), స్పైస్‌జెట్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు ఈ వారంలో తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించబోతున్నాయి. వీటితో పాటు ఇతర దేశీయ కంపెనీలు ప్రకటించనున్న రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, మధ్యప్రాచ్య దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రత్యేకించి అక్కడ పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికాలో పెరుగుతున్న చమురు ఉత్పత్తి తదితర అంశాలు కూడా మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన పిసిజి రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ టీనా వీర్‌మణి తెలిపారు. ప్రస్తుతం మందకొడిగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి రేటు సెప్టెంబర్‌లో 3.8 శాతంగా నమోదైంది. తయారీ రంగ పనితీరు స్తబ్దుగా ఉండటంతో పాటు వినిమయ వస్తువుల ఉత్పత్తి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితో పాటు మరికొన్ని ఇతర అంశాలు ప్రభావం చూపడంతో గత వారం బిఎస్‌ఇ సెనె్సక్స్ 371 పాయింట్లు (1.10 శాతం) దిగజారగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 130.75 పాయింట్లు (1.25 శాతం) పతనమైన విషయం తెలిసిందే.