బిజినెస్

వెల్లివిరిసిన కొనుగోళ్ల ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 28: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ లాభాలను అందుకున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఈ ఏడాదిలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అసోం అధికార పగ్గాలు తొలిసారిగా బిజెపి చేతికి చిక్కడం, రాబోయే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,351.70 పాయింట్లు ఎగిసి 26 వేల స్థాయిని అధిగమించి 26,653.60 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 406.95 పాయింట్లు ఎగబాకి 8 వేల స్థాయికి ఎగువన 8,156.65 వద్ద నిలిచింది. గడచిన వారంలో సోమవారం మినహా మిగతా నాలుగు రోజులు సూచీలు లాభాల్లోనే కదలాడగా, బుధ, గురువారాల్లో భారీ లాభాలను అందుకున్నాయి. శుక్రవారం సైతం అదే రీతిలో పరుగులు పెట్టాయి.
ఇకపోతే గడచిన వారం 25,447.72 పాయింట్లతో సెనె్సక్స్ ట్రేడింగ్ మొదలవగా, కనిష్ట స్థాయి 25,181.47, గరిష్ఠ స్థాయి 26,677.43 పాయింట్లు. అలాగే 7,813.95 పాయింట్లతో నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభమవగా, కనిష్ట స్థాయి 7,715.80, గరిష్ఠ స్థాయి 8,164.20 పాయింట్లు. ఇకపోతే విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 872.38 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. క్యాపిటల్ గూడ్స్ షేర్లు అత్యధికంగా 11.19 శాతం లాభపడితే, బ్యాంకింగ్ 6.46 శాతం, ఎఫ్‌ఎమ్‌సిజి 5.50 శాతం, పవర్ 4.34 శాతం, రియల్టీ 4.11 శాతం, చమురు, గ్యాస్ 3.94 శాతం, ఆటో 3.56 శాతం, ఐటి 3.26 శాతం, టెక్నాలజీ 3.20 శాతం, మెటల్ 2.98 శాతం, హెల్త్‌కేర్ 1.24 శాతం చొప్పున పెరిగాయి. కనిష్టంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు 0.72 శాతం లాభపడ్డాయి. బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ సూచీ 1.34 శాతం, మిడ్-క్యాప్ సూచీ 2.94 శాతం చొప్పున పెరిగాయి.
టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 13,316.16 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 90,933.20 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 15,237.67 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 79,727.92 కోట్ల రూపాయలుగా ఉంది.