బిజినెస్

విమానయాన రంగంలో ఆరోగ్యకరమైన వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 17: దేశీయ పౌర విమానయాన రంగం ఆరోగ్యకరమైన వృద్ధితో ముందుకు సాగుతోంది. గత నెలలో ప్రయాణికుల సంఖ్య 20.50 శాతం పెరిగి 10.45 మిలియన్ల మార్కుకు చేరుకుంది. దీంతో ఈ ఏడాది దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించిన వారి సంఖ్య రెండోసారి 10 మిలియన్ల మార్కును దాటినట్లయింది. గత ఏడాది అక్టోబర్‌లో వీరి సంఖ్య 8.67 మిలియన్లుగా ఉన్నట్లు డీజీసిఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాది మే నెలలో తొలిసారి 10 మిలియన్ల మార్కును దాటి 10.74 మిలియన్లకు చేరుకుందని, గత ఏడాది మే నెలలో నమోదైన గణాంకాలతో పోలిస్తే ఇది 17.36 శాతం ఎక్కువని డీజీసిఏ వెల్లడించింది. ప్రస్తుతం పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మినహా దేశంలోని మిగిలిన అన్ని విమానయాన సంస్థలు గత నెలలో ఎంతో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించాయని, వాటిలో 80 శాతానికి పైగా లోడ్ ఫ్యాక్టర్ నమోదైందని డీజీసిఏ స్పష్టం చేసింది.