బిజినెస్

మార్కెట్లకు మూడీస్ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 17: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ భారత భవితవ్యం దివ్యమంటూ లెక్కలు కట్టిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త ఉత్తేజంతో పరుగులు పెట్టాయి. ఇనె్వస్టర్ల విశ్వాసం కూడా ఇనుమడించడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ శుక్రవారం 0.5 శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి. ఒక దశలో సెనె్సక్స్ 414 పాయింట్ల వరకు పెరిగింది. అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో 235.98 పాయింట్లు పెరిగి 0.71 శాతం అధికంగా 33,342.80 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 68.85 పాయింట్లు పుంజుకుని 10,283.60 వద్ద ముగిసింది. అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ మూడీస్ భారత ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండబోతోందంటూ ఉత్తేజకరమైన రేటింగ్ ఇవ్వడం, దేశంలో అమలవుతున్న సంస్కరణలపైన సానుకూల అంచనాలను ఆవిష్కరించడం మార్కెట్‌పై గుణాత్మక ప్రభావాన్ని చూపించింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత భారత రేటింగ్ బిఏఏ-2గా నిర్ధారించింది. దీని వలన దేశంలోకి మరింతగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందని ఇనె్వస్టర్లు భావిస్తున్నారు. నేటి లావాదేవీల్లో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు బాగా పుంజుకున్నాయి. ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ షేర్ల విలువ 1.86 శాతం మేరకు పెరిగింది. అయితే ఐటి, టెక్నాలజీ షేర్లు 1 శాతం మేర నష్టాన్ని చవిచూశాయి. ఇవి మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు మరింత బలపడ్డాయి. 2.61 శాతం పెరుగుదలతో సిప్లా సెనె్సక్స్‌కు సారథ్యం వహించింది. అలాగే మారుతీ సుజుకీ షేర్లు 2.15 శాతం మేరకు పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో షేర్లు 1.78 శాతం మేర నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడంతో శుక్రవారం ఒక్క రోజులోనే ఇనె్వస్టర్ల సంపద 1.71 లక్షల కోట్ల మేరకు పెరిగింది.