బిజినెస్

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 7.8 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 30: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.8 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని స్విట్జర్లాండ్ ఆర్థిక సేవల దిగ్గజం క్రెడిట్ సూస్ అంచనా వేసింది. వ్యవసాయం, వినియోగం విషయంలో పురోగతి కనిపిస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. అయితే ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్) కంటే, ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో జిడిపి వృద్ధి పుంజుకోవడానికి అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.5 శాతంగా ఉన్న దేశ జిడిపి వృద్ధిరేటు.. ఈ ఆర్థిక సంవత్సరం 7.8 శాతానికి పెరగవచ్చని అభిప్రాయపడింది. కాగా, కార్పొరేట్ పెట్టుబడులు, ఎగుమతుల్లో మందగమనం కొనసాగవచ్చంది. ఇదిలావుంటే 2015-16 చివరి త్రైమాసికమైన ఈ ఏడాది జనవరి-మార్చిలో జిడిపి వృద్ధిరేటు గతంతో పోల్చితే 7.3 శాతం నుంచి 7.5 శాతానికి పెరుగుతుందని క్రెడిట్ సూస్ తెలిపింది. మంగళవారం దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెలువడనున్నాయి.