బిజినెస్

‘చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్దరించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడమే కాకుండా అక్రమ లే ఆఫ్‌ను ఎత్తివేసి కార్మికులకు రావాల్సిన రెండున్నరేళ్ల జీతాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని చేర్చిందని, కానీ ఇంతవరకు ఎలాంటి చొరవ తీసుకోలేదని అన్నారు.