బిజినెస్

ఆఫ్రికా రిటైల్ ఆయిల్ వ్యాపారాన్ని వదులుకున్న రిలయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. ఆఫ్రికా చమురు రిటైల్ వ్యాపారం నుంచి బయటికొచ్చింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్ (గ్యాప్కో)లో ఆర్‌ఐఎల్‌కున్న మొత్తం 76 శాతం వాటాను టోటల్ సంస్థ కొనుగోలు చేస్తోంది. ఆఫ్రికాలో పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ వ్యాపారంలో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎస్‌ఎ అగ్రశ్రేణిలో ఉంది. అయితే ఎంత మొత్తానికి ఆర్‌ఐఎల్ వాటాను టోటల్ కొనుగోలు చేస్తుందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, కెన్యా, ఉగాండ, టాంజానియాల్లోని రిలయన్స్ గ్యాప్కో ఆస్తులు ఈ లావాదేవీలతో టోటల్ చేతికి రానున్నాయి. కాగా, గ్యాప్కోలో 76 శాతం వాటాను ఆర్‌ఐఎల్ విదేశీ విభాగం రిలయన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ డిఎమ్‌సిసి కలిగి ఉండగా, మిగతా 24 శాతం వాటాను ఫార్చూన్ ఆయిల్ కార్ప్, మారిషస్‌కున్నాయి.