బిజినెస్

‘బ్యాడ్ బ్యాంక్’ దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని ప్రమాదంలో పడేసిన మొండి బకాయిల సమస్యను ఎదుర్కొనేందుకు ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. అయితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఓ నిరర్థక ఆస్తుల నిధిని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉందన్న వార్తల మధ్య ఈ ‘బ్యాడ్ బ్యాంక్’కు ఎస్‌బిఐ నేతృత్వం వహిస్తుందా? అన్నదానికి మాత్రం ఆయన ఖచ్చితమైన సమాధానం తెలియపరచలేదు. కాగా, మొండి బకాయిలు ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలను దాటిపోగా, ఈ జనవరి-మార్చిలో ఈ మొండి బకాయిల కారణంగానే పెద్ద సంఖ్యలో ప్రభుత్వరంగ బ్యాంకులు భారీ నష్టాలను చవిచూసినది తెలిసిందే.