బిజినెస్

రూ. 9,999లకే విండోస్ 10 ల్యాప్‌టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: దేశంలో మొదటిసారిగా విండోస్ 10 ల్యాప్‌టాప్ కేవలం 9,999 రూపాయలకే అందుబాటులోకి తెచ్చినట్లు ఐబాల్ డైరెక్టర్, సిఇఒ సందీప్ పరశురాంపూరియా తెలిపారు. అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులకు పేరెన్నికగన్న బ్రాండ్ ఐబాల్.. ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌ల భాగస్వామ్యంతో 9,999 రూపాయల తక్కువ ధరకే విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను అందిస్తోంది. కాగా, నూతన ఆవిష్కరణలు చేయడమే తమ లక్ష్యమని, యువత అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంపైనే తమ ప్రధాన దృష్టి అని రాంపూరియా అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా కన్స్యూమర్ ఛానల్ గ్రూపు, దేశీయ జనరల్ జనరల్ మేనేజర్ ప్రియదర్శి మొహపాత్ర మాట్లాడుతూ వినియోగదారులకు మరింత చేరువవడానికి ఐబాల్-ఇంటెల్‌తో కలిసి ఆవిష్కరించిన కాంప్‌బుక్ దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయంగా 300 మిలియన్ల డివైస్‌ల్లో విండోస్ 10ను ఉపయోగిస్తున్నారన్నారు.