బిజినెస్

మొహం చాటేసిన సీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 3: ఈ ఏడాది పత్తి వ్యాపారంలో భారత కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) వెనకడుగు వేయడంతో వ్యాపారులదే ఆధిపత్యం కొనసాగుతోంది. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4320 ప్రకటించగా ఆదిలాబాద్, బోథ్, భైంసా మార్కెట్‌లో వ్యాపారులు కనీస మద్దతు ధరకంటే అధికంగా ధర చెల్లించి కొనుగోళ్ళు చేపట్టడంతో వ్యాపార రంగంలో సీసీఐ మొహం చాటేస్తోంది. సీసీఐ కొనుగోళ్ళు జరిపితే పత్తి ధర మరింత పెరుగుతుందని ఆశించిన రైతులకు ఈసారి భంగపాటే ఎదురవుతోంది. ఈ ఏడాది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 26 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని భారత కాటన్ కార్పొరేషన్ ప్రకటించగా ఉమ్మడి జిల్లాల్లో పది మాత్రమే మొక్కుబడిగా కొనుగోళ్ళు ప్రారంభించి చేతులెత్తేసింది. ఆదిలాబాద్‌లో 3 కేంద్రాలు, ఇచ్చోడలో 1, బోథ్‌లో 3 కేంద్రాలు, గుడిహత్నూర్‌లో 1, ఇంద్రవెల్లిలో 1, జైనథ్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేసింది. పత్తి తేమ శాతం పడిపోవడంతో నాణ్యత బాగుందని చెప్పి వ్యాపారులు మార్కెట్‌లో రైతుల నుండి భారీగా కొనుగోళ్ళు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ నామ్‌కేవాస్తేగా కొనుగోళ్ళు చేపట్టడంపై రైతుల నుండి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పత్తి వ్యాపారంలో పోటీ పెరగాలంటే సీసీఐ రంగంలో ఉంటేనే పత్తికి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది గులాబి పురుగు తెగులు సోకి ఆశించిన స్థాయికంటే 30 శాతం దిగుబడులు తగ్గి రైతులు నష్టపోగా మార్కెట్‌లో గిట్టుబాటు ధర మామూలుగానే ఉంది. కాటన్ వ్యాపారంలో బేళ్ల ధర పెరగడంతో పత్తి ముడిసరుకుకు కూడా క్రమంగా ధర పెరుగుతోంది. క్వింటాలుకు రూ.4500 నుండి 4600 వరకు ధర పలుకుతుందని పేర్కొంటున్నారు. నెల రోజుల క్రితం వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమ శాతం 20 నుండి 25 శాతం ఉండగా ప్రస్తుతం 8 నుండి 14 వరకు మాత్రమే పత్తిలో తేమశాతం నిర్ధారణవుతోంది. దీంతో వ్యాపారుల మద్య పోటీ పెరగడంతో రైతుకు కొంతమేరకు లాభం చేకూరుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధరలు పుంజుకోవడంతో వ్యాపారులు పోటీపడి మరి ధరను పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వరకు 8 లక్షల 92 వేల క్వింటాళ్ళ పత్తి కొనుగోళ్ళు జరిగితే సీసీఐ ఆలస్యంగా రంగంలోకి దిగి కేవలం 320 క్వింటాళ్ళ కొనుగోళ్లు మాత్రమే చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 16 లక్షల క్వింటాళ్ళ పత్తి వ్యాపారం జరిగితే సీసీఐ మొక్కుబడిగా వెయ్యి క్వింటాళ్ళలోపే కొనుగోళ్ళు జరిపి చేతులు దులుపుకోవడం గమనార్హం.

చిత్రం.. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో విక్రయిచడానికి రైతులు తెచ్చిన పత్తి