బిజినెస్

కేటీపీపీలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 3: వెలుగులు అందించే కాకతీయ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో ఉద్యోగాల వస్తే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని దళారులను నమ్మిన నిరుద్యోగుల బతుకుల చీకటిమయంగా మారుతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు, దళారులు కేటీపీపీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నుంచి లక్షల్లో రూపాయాలు వసూలు చేస్తు మోసం చేస్తుండగా, ఇందుకు సంస్థలోని కొంతమంది ఉద్యోగుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. భూపాలపల్లి చెల్పూర్ కేటీపీపీలో 11 వందల మెగావాట్ల ప్లాంటులో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరీక్ష విధానంతో పాటు నిర్వాసితులకు కోటా ప్రకారం టీఎస్‌జెన్‌కో సంస్థ చేపడుతుంది. ఉద్యోగాల కోసం వేలాది మంది ప్రయత్నాలు చేస్తుండడంతో నిరుద్యోగులను నమ్మిస్తున్న దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగానికి ఒక రేటు, పరీక్షలో ఉద్యోగం రాకున్న ఇంతరేటు అంటూ నిరుద్యోగులకు గాలం వేసి ఉద్యోగాల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. నిరుద్యోగులు డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఒత్తిడి తేవడంతో దళారులు ఏకంగా నకిలీ నియామాకపు పత్రాలను అందజేస్తుండడం, తీరా అవి నకిలీవిగా తేలడంతో బాధితులు లాబోదిబోమంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేటీపీపీలో ఎలక్ట్రీషియన్, జూనియర్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డు, సీఎల్ మెయంటె నెన్స్ ఇలా ఒక్కో పోస్టుకు ఒక్కో ధర నిర్ణయించిన దళారులు ప్లాంట్‌లోకి తీసుకెళ్లి తిప్పి చూపిస్తూ నిరుద్యోగులను నమ్మబలుకుతూ డబ్బులు వసూలు చేస్తు టోకరా వేస్తున్నారు. గత కొనే్నళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తూ వస్తున్న దళారులు కేటీపీపీలోని అధికారుల పేరుతో ఉద్యోగం నియామకపు పత్రాలు అందించారు. ఏకంగా ఉద్యోగంలో చేరే తేదీ, సమయం సైతం నకిలీ నియాకపు పత్రాల్లో ముద్రించి 20 మంది నిరుద్యోగులకు అందించారు. 15 మే, 16 మే 2017 పేరిట ఉద్యోగంలో జాయినింగ్ తేదీ, సమయం ముద్రించి నిరుద్యోగులకు అందించడంతో అక్కడికి వెళ్లిన వారికి అసలు నియాకపు పత్రాలు కావని తేలింది. దీంతో బాధిత నిరుద్యోగుల్లో ఆందోళన మొదలై నేటివరకు విషయం బయటికి పొక్కలేదు. విషయం బయటకు వస్తే తాము ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయో రావో అనే ఆందోళన బాధితుల్లో మొదలైంది. నకిలీ నియామకపు పత్రాలు అందిన 20 బాధితులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మరో 2 వందల మంది బాధితులు ఉన్నట్లు తెలుస్త్తోంది. ఒక్కొక్కరి వద్ద ఒక్కో రేటుతో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల చొప్పున సుమారు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. నకిలీ నియాకపు పత్రాలుగా తేలినా నేటికీ బాధితులు పోలీసులను ఆశ్రయించనట్లు తెలుస్తోంది. బాధితుల్లో పోలీసు కుటుంబానికి చెందిన ఒక నిరుద్యోగి ఉన్నట్లు సమాచారం. ఇందులో కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉండడంతోనే దళారుల నుంచి డబ్బులు రాబట్టుకోలేక పోలీసులను ఆశ్రయించలేక బాధితులు ఆందోళనలో ఉన్నట్లు భోగట్టా. ఈ వ్యవహారంలో వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం చర్లపల్లికి చెందిన ఒక కేటుగాడు కీలక పాత్ర పోషించి కేటీపీపీలోని మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ నకిలీ నియామకపు పత్రాలను సృష్టించినట్లు తెలుస్తోంది. ప్లాంట్‌లోకి అనుమతి లేనిదే మీడియాను సైతం లోనికి రానివ్వని అధికారులు దళారులు ప్లాంట్‌లోకి అత్తారింటికి వెళ్లివచ్చే చందంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్‌కు వచ్చే వ్యక్తుల కదలికలను సీసీ కెమెరాల ద్వారా నిశితంగా పరిశీలించే యాజమాన్యం దళారులు వచ్చి యథేచ్ఛగా ప్లాంటులో తిరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెన్‌కో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ అధికారులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండడంతో ఇక్కడ ఇలా జరుగుతోందని, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు విచారణ జరిపి మరిన్ని విషయాలు బహిర్గతం ఆయ్యే అవకాశాలు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై కేటీపీపీ సీఈ మంగేష్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.