బిజినెస్

మార్చినాటికి మూలధన సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ పథకంలో భాగంగా ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌యూలు) నాలుగు నెలల్లోగా మార్కెట్ నుంచి మూలధనాన్ని సేకరించుకోవాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని బ్యాంకులు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందాయని, మరికొన్ని బ్యాంకులు ప్రైవేటు ప్లేస్‌మెంట్ ద్వారా కాని, రైట్స్ ఇష్యూ ద్వారా కాని మూలధనాన్ని సేకరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందే ప్రక్రియను నడుపుతున్నాయని ఆ వర్గాలు వివరించాయి. అయితే చాలా బ్యాంకులు క్వాలిఫయిడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపి) మార్గంలో మూల ధనాన్ని సేకరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. మార్కెట్ నుంచి మూల ధనాన్ని సేకరించే విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అగ్ర స్థానంలో ఉంది. ఈ బ్యాంకు మార్కెట్ నుంచి రూ. 5వేల కోట్లను సేకరించబోతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ కూడా తమ వాటాల విక్రయం ద్వారా మూలధన సేకరణకు కసరత్తు చేస్తున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఏల) భారంతో కుంగిపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అక్టోబర్‌లో అసాధారణ స్థాయిలో రూ. 2.11 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. రెండు సంవత్సరాల కాలంలో ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. 2015 మార్చిలో రూ. 2.75 లక్షల కోట్లు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పాడు రుణాలు లేదా నిరర్ధక ఆస్తులు 2017 జూన్ నాటికి రూ. 7.33 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రూ. 1.35 లక్షల కోట్లకు రీ-క్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేస్తారు.
బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటాలను విక్రయించడం ద్వారా రూ. 58వేల కోట్లను సేకరిస్తారు. ఈ విధానం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటా 52 శాతానికి తగ్గిపోతుంది. బ్యాంకులు రానున్న రెండేళ్లలో ఇంద్రధనుస్ పథకం కింద రూ. 18వేల కోట్లను పొందుతాయని కూడా జైట్లీ ప్రకటించారు. 2015లో ప్రకటించిన ఇంద్రధనుస్ పథకం ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 70వేల కోట్ల సాయం చేస్తుంది. బ్యాంకులు తమ స్వంతంగా మార్కెట్ నుంచి రూ. 1.1 లక్షల కోట్లను సేకరించుకోవలసి ఉంటుంది. ఈ రెండింటి వల్ల బ్యాంకులు తమ మూలధన అవసరాలను తీర్చుకోవలసి ఉంటుంది.
ఈ పథకం కింద ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో రూ. 51,858 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు విడుదల చేసింది. మిగిలిన రూ. 18,142 కోట్లను రానున్న రెండేళ్లలో విడుదల చేస్తుంది.