బిజినెస్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గురువారం మెల్‌బోర్న్‌లో తెలంగాణ ప్రజలను కలుసుకున్నారు. తోర్న్‌బరీ థియేటర్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు వేల మైళ్ల దూరం నుంచి వచ్చి మెల్‌బోర్న్‌లో స్థిరపడి అభివృద్ధి చెందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. కాకతీయుల కాలం నాటి గొలుసు చెరువులను పునురుద్దరించేట్టుగా మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మరమ్మతులు జరిగాయన్నారు. ఇంటింటికి నీరివ్వాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించామని, ఈ పథకాన్ని కొన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. ఈ పథకానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కొత్త రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఏర్పడుతుందన్న విమర్శలకు కొట్టిపారేస్తూ, 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని, రైతులకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. వివాహం కాని యువతుల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయని హోంమంత్రి నాయిని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి శ్రీనివాస్‌రెడ్డి, ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం అధ్యక్షుడు విజయ గంగసాని తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మెల్‌బోర్న్‌లో పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి