బిజినెస్

లాభాలు ఆర్జించిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: దేశీయ మార్కెట్లు ఈ వారంలో మొత్తం మీద లాభాలనే ఆర్జించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 417.36 పాయింట్లు పుంజుకొని 33,000 వేల స్థాయిని అధిగమించి, 33,250.30 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 10,250 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించి, 10,265.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత మార్కెట్లలో ఉన్న బలమైన పునాది కారణంగా చివరకు కొనుగోళ్లు పుంజుకోవడం వల్ల పలు కంపెనీల షేర్ల ధరలు పెరిగి ప్రధాన సూచీలు పైకి ఎగబాకాయి. ద్రవ్య విధానాన్ని సమీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటి సమావేశం కానుండటం వల్ల మదుపరులు ఆచితూచి అడుగులు వేయడంతో ఈ వారం మార్కెట్లు స్వల్ప లాభాలతోనే ప్రారంభమయ్యాయి. సేవా కార్యకలాపాలు తగ్గడం వల్ల నెలకొన్న ఆందోళనలు, ఫిచ్ రేటింగ్‌ను తగ్గించడం వంటివి కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించకుండా యథాతథంగా ఉంచడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన అర్ధ భాగానికి ద్రవ్యోల్బణం అంచనాలను పెంచినప్పటికీ, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో దేశీయ ఫండ్‌లు, రిటెయిల్ ఇనె్వస్టర్లు నిరాటంకంగా కొనుగోళ్లు జరపడంతో షేర్ల ధరలు పెరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వంత రాష్టమ్రైన గుజరాత్‌లో అధికార బీజేపీ ఆధిక్యంలో ఉందని ఎన్నికల సర్వేలు వెల్లడించిన తరువాత మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. మార్కెట్లలో సానుకూల ధోరణికి వేగంగా ఆర్థిక సంస్కరణల అమలు, రాజకీయ స్థిరత్వం ఎంతో ముఖ్యం. ప్రస్తుత ప్రభుత్వంతోనే ఈ రెండూ సాధ్యమని చాలా మంది ఇనె్వస్టర్లు భావిస్తుండటం వల్ల గుజరాత్ ఎన్నికలపై బీజేపీకి అనుకూలంగా వెలువడిన ఎన్నికల సర్వేలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.
ఈ వారం సెనె్సక్స్ 33,968.02 పాయింట్ల గరిష్ఠ స్థాయి వద్ద ప్రారంభమయి, 33,285.68 - 32,565.16 పాయింట్ల మధ్య కదలాడి చివరకు 33,250.30 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ వారంలో 417.36 పాయింట్లు (1.27 శాతం) లాభపడింది. సెనె్సక్స్ గత వారం 846.30 పాయింట్లు (2.51 శాతం) పడిపోయిన విషయం విదితమే.
నిఫ్టీ ఈ వారం 10,175.05 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,270.85- 10,033.35 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు 10,265.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ మొత్తం మీద 143.85 పాయింట్లు (1.42 శాతం) పెరిగింది.
రంగాల వారీగా చూస్తే, ఈ వారంలో దీర్ఘకాలం మనే్న వినియోగ వస్తువులు, ఎఫ్‌ఎంసీజీ, చమురు-సహజ వాయువు, టెక్నాలజి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), ఆటో, రియాల్టీ, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), లోహ, బ్యాంకులు, ఉత్పాదక వస్తువులకు చెందిన కంపెనీల షేర్లలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. ఇదిలా ఉండగా, ఈ వారంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ. 4,161.22 కోట్ల విలువ గల షేర్లను విక్రయించినట్లు సెబి రికార్డులు వెల్లడించాయి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ మిడ్-క్యాప్ సూచీ ఈ వారం 287.09 పాయింట్లు (1.71 శాతం) పెరిగి, 17,044.36 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ స్మాల్-క్యాప్ సూచీ 194.40 పాయింట్లు (1.08 శాతం) పుంజుకొని 18,211.88 పాయింట్ల వద్ద స్థిరపడింది.
రంగాల వారీ సూచీలలో కన్జ్యూమర్ డ్యూరేబుల్స్ 2.72 శాతం, ఎఫ్‌ఎంసీజీ 2.70 శాతం, చమురు-సహజ వాయువు 2.68 శాతం, టెక్నాలజి 2.61 శాతం, ఐటీ 2.05 శాతం, ఆటో 1.48 శాతం, రియాల్టీ 1.36 శాతం, హెల్త్‌కేర్ 1.21 శాతం, మెటల్ 0.76 శాతం, బ్యాంకెక్స్ 0.75 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.74 శాతం, ఐపీఓ 0.70 శాతం, పవర్ 0.26 శాతం చొప్పున పెరిగాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని 31 కంపెనీలలో 21 కంపెనీల షేర్ల ధరలు పెరగగా, మిగతా పది కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. భారతి ఎయిర్‌టెల్ షేర్ ధర 8.02 శాతం పెరిగింది.