బిజినెస్

ఎలక్ట్రానిక్ వస్తువులపై పెరిగిన దిగుమతి సుంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు, ప్రొజెక్టర్లు, వాటర్ హీటర్లు సహా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దేశీయంగా వీటి తయారీకి ఊతమిచ్చే చర్యలో భాగంగా ప్రభుత్వం వీటిపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, టెలివిజన్ సెట్‌పై దిగుమతి సుంకం పది శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. అలాగే మానిటర్లు, ప్రొజెక్టర్లపై రెండింతలు పెరిగి 20 శాతానికి చేరింది. టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లపై ఇప్పటి వరకు దిగుమతి సుంకం లేదు. తాజాగా వీటిపై 15 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. వాటర్ హీటర్లు, హెయిర్ డ్రెస్సింగ్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని పది శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఎలక్ట్రానిక్ ఫిలమెంట్, డిశ్చార్జ్ ల్యాంప్‌లపై కూడా దిగుమతి సుంకం పెరిగింది.