బిజినెస్

పెద్ద నోట్ల రద్దు మేలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్‌లో అంతే మేలేనని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. నగదు నిల్వల కొరత కారణంగా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడం కనిపించినా, ఏడాది తరువాత హితమైన మేలే కనిపిస్తోందని ప్రపంచ బ్యాంకు సమాచార విభాగం సహాయ అధికార ప్రతినిధి విలియం ముర్రే మీడియాకు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కనిపించిన మాట వాస్తవమే.
ముఖ్యంగా ప్రాథమిక దశలో నగదు నిల్వల కొరత కారణంగా వ్యక్తిగత వినియోగం, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావమే చూపించింది. అయితే, ఈ పరిస్థితి ఎంతోకాలం లేదు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, ‘నగదు నిల్వలు క్రమంగా అందుబాటులోకి వచ్చిన తరువాత, చాలా సమస్యలకు తక్షణ పరిష్కారం లభించింది.
అంతేకాదు, నగదు చెల్లింపుల క్రమబద్ధీకరణ, బ్యాంకింగ్ వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులు సులభతరం కావడం కనిపిస్తోంది’ అని ముర్రే అభిప్రాయపడ్డారు. నల్లధనం, అవినీతి నియంత్రణ లక్ష్యంగా గత నవంబర్ 18న కేంద్రం పెద్ద నోట్ల రద్దు ప్రకటించడం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు భారత వృద్ధి రేటుపై ఎలాంటి ప్రభావం చూపించిందన్న అంశాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు, పై విధమైన ప్రకటన చేయడం గమనార్హం.