బిజినెస్

ఫోక్స్‌వాగన్ 1.9 లక్షల కార్ల రీకాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 4: కాలుష్య ఉద్గారాల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. భారత్‌లో 1.9 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. జూలై నుంచి ఈ రీకాల్ మొదలవుతుంది. కాలుష్య ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను ఈ కార్లలో బిగించనుంది ఫోక్స్‌వాగన్. ఈ రీకాల్ స్వచ్చంధంగా జరుగుతోందని ఫోక్స్‌వాగన్ ఇండియా మార్కెటింగ్ అధిపతి కమల్ బసు పిటిఐకి తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కాలుష్య ఉద్గారాల నిబంధనలను ఫోక్స్‌వాగన్ ఉల్లంఘించినట్లు తేలినది తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను బిగించడం జరగగా, ఇదే ప్రక్రియను భారత్‌లోనూ కొనసాగించాలని ఫోక్స్‌వాగన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయార్ధం (జూలై) ఆరంభం నుంచి ఆ ప్రక్రియను మొదలుపెట్టనున్నాం.’ అని ఫోక్స్‌వాగన్ తెలిపింది.