బిజినెస్

ఆదుకున్న మెటల్, ఆటో షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభాలను అందుకున్నాయి. మెటల్, ఆటోరంగ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 189.43 పాయింట్లు పెరిగి 26,843.03 వద్ద ముగిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 64.15 పాయింట్లు లాభపడి 8,220.80 వద్ద నిలిచింది. అంతకుముందు వారమైతే సూచీలు భారీ లాభాలను పొందాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, అసెంబ్లీ ఎన్నికల్లో అసోం అధికార పగ్గాలు తొలిసారిగా బిజెపి చేతికి చిక్కడం, రాబోయే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా సెనె్సక్స్ 1,351.70 పాయింట్లు, నిఫ్టీ 406.95 పాయింట్లు ఎగబాకాయ. ఇక గడచిన వారం సెనె్సక్స్ కనిష్ట స్థాయి 26,561.58 పాయింట్లుగా, గరిష్ఠ స్థాయి 27,008.14 పాయింట్లుగా ఉంది. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.9 శాతంగా నమోదవడం, గత ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. దీనికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ అంచనాలు మరింత బలం చేకూర్చాయి. దీంతో మదుపరులు పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరిచారు. వౌలిక రంగం వృద్ధిరేటు 8.5 శాతానికి ఎగబాకడం కూడా కలిసొచ్చింది. సేవా, తయారీ రంగాల్లో వృద్ధి పడిపోయిందన్న పిఎమ్‌ఐ గణాంకాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యపరపతి విధాన ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఈ షేర్ల విలువ 4.96 శాతం నుంచి 0.94 శాతం వరకు పెరిగింది. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 2.68 శాతం నుంచి 0.25 శాతం వరకు నష్టపోయాయి. నిజానికి గడచిన వారం ట్రేడింగ్‌లో మంగళవారం సూచీలు నష్టపోగా, శుక్రవారం దాదాపు యథాతథంగా ముగిశాయి. మిగతా మూడు రోజులైన సోమ, బుధ, గురువారాల్లో కూడా ఓ మోస్తరు లాభాలనే అందుకున్నాయి. ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షకు ముందు మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాటకు గురయ్యారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్షపై ఊహాగానాలు కూడా ఇందుకు కారణమైయ్యాయి. ఇక మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాల ప్రకారం గడచిన వారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 2,940.67 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పట్టుకొచ్చారు. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 14,092.84 కోట్ల రూపాయలుగా ఉంది. ఎన్‌ఎస్‌ఇ 1,07,042.86 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 13,316.16 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 90,933.20 కోట్ల రూపాయలుగా ఉంది.